దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలి

దగా డీఎస్సీ కాదు.. మెగా డీఎస్సీ కావాలి

- జనసేన నేత గురాన అయ్యలు
జనం న్యూస్,ఫిబ్రవరి 04 విజయనగరండీఎస్సీ పేరు తో వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల ను దగా చేస్తోందని జనసేన నేత గురాన అయ్యలు విమర్శించారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూఅదిగో మెగా డీఎస్సీ ఇదిగో మెగా డీఎస్సీ అంటూ ఊరించి నాలుగున్నర ఏళ్ల తర్వాత నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెట్టిన ఘనత రాష్ట్ర ప్రభుత్వనికే దక్కిందన్నారు.ఎన్నికల ముందు మెగా డీఎస్సీ అని చెప్పిన ప్రభుత్వం ఇన్నాళ్లూ కాలాయపన చేసి, తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి సీఎం జగన్ కు నిరుద్యోగులు గుర్తొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోసారి మోసం చేయడానికి మెగా డీఎస్సీ పేరుతో మెగా దగా చేయడానికి సిద్ధమయ్యాడని దీన్ని నిరుద్యోగులు గమనించాలని కోరారు. రాష్ట్రంలో 21వేల టీచర్‌ పోస్టులు ఖాళీలు ఉంటే కేవలం 6,100తో మమ అనిపిస్తున్నారని. ఇది నిరుద్యోగులను, ప్రజలను మోసం చేయడం కాదా? అంటూ ప్రశ్నించారు. 2013లో రద్దయిన అప్రెంటిషిప్ విధానాన్ని అమలు చేయడం అన్యామన్నారు. జ‌గ‌న్ మాయ‌మాట‌లు న‌మ్మొద్దు అని నిరుద్యోగులకు సూచించారు.జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడంతో వైసీపీ మాటలు నమ్మిన నిరుద్యోగ యువత ఇప్పుడు నిరుత్సాహ పడుతుందన్నారు. నిరుద్యోగులకు అండగా జనసేన పార్టీ వుంటుందన్నారు.జ‌న‌సేన-టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తామన్నారు.అలాగే అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి, లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు