నిర్బంధాలతో ప్రజా విద్య మాల్ని అణచివేయలేరు వద్ద నాగ జగదీష్

నిర్బంధాలతో ప్రజా విద్య మాల్ని అణచివేయలేరు వద్ద నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 10 (అనకాపల్లి జిల్లా)

జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధంతో ప్రజా ఉద్యమాలను అణచిలేరని, అంగన్వాడీ ఉద్యోగులపై ఎస్మాను ప్రయోగించి సమ్మెను నిషేధించడం అంటే ప్రజాతంత్ర హక్కులపై దాడి చేయడమేనని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఘాటుగా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కార్మిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారని, విద్యుత్ ఆర్టీసీ లాంటి అత్యవసర రంగాలపై విధించే ఎస్మాను అన్ని రంగాలకు విస్తరించేందుకు మార్గమే అంగన్వాడీలపై ప్రయోగమని, ఎస్మా అమలు ఉండగానే విద్యుత్, ఆర్టీసీల్లో అనేకసార్లు సమ్మెలో చేశారని, ఎస్మాను ప్రయోగిస్తే సమ్మెలు జరగవ ని ప్రభుత్వం భ్రమ పడుతుందని, ఇప్పుడు అంగన్వాడీలు గాని గతంలో అనేక రంగాల్లో గాని సమ్మెలు కొనసాగాయని, అసలు సమస్యల పరిష్కరించకుంటే ఎస్మా లాంటి నిర్బంధ బ్రహ్మాస్త్రాలు ప్రయోగించిన కార్మిక వర్గం అదరదు, బెదరదు, అని పాలకులు గుర్తించాలని, ప్రభుత్వము ఉద్యోగులు భార్యాభర్తల బంధం లాంటిదని, ఘర్షణ జరిగినప్పుడు సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని, పోలీసులు సహకారంతో అరెస్టులు చేసి ఉద్యోగులను భయపెట్టాలని చూస్తుందని, సమ్మె కార్మికుల ప్రాథమిక హక్కు సమ్మెలు జరగడంమoటేనే పాలకుల వైఫల్యాలకు తార్కానమని, కార్మిక వర్గం ఊరికే సమ్మెలకు సిద్ధం కాదని, సమ్మెలో ఉండే కష్టాలు, కార్మికులకు తెలుసు పట్టుదలగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మె విఫలం చేసేందుకే పాలకులు పోటీ కార్మికులను ఉపయోగించడం చట్ట వ్యతిరేక చర్యని, లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయడం కంటే సమ్మెను విఫలం చేయాలని పాలకులు సర్వసక్తులు ప్రయోగిస్తున్నారని నాగ జగదీష్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది అంగన్వాడీలు 29 రోజులుగా నిరవధిక సమ్మె సాగిస్తున్నారని, ఈ సమ్మెను ఉక్కు పాదంతో అణిచివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించిందని, అంగన్వాడీల సెంటర్లో తీరుస్తామని, తాళాలు బద్దలు కొడదామని, ఉద్యోగులను తొలగిస్తామని, ఎస్మాని ఉపయోగించి వారెంట్ లేకుండా అరెస్టులు చేసి జైల్లో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఉడత ఊపులు ఊపుతుందని నాగ జగదీశ్ ఎద్దేవా చేశారు. మరోవైపున జీతాలు రూపాయి కూడా పెంచమని, గ్రాట్యూటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిన వినమని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వాదనలను చేస్తుందని, ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అంగన్వాడీలు ఒళ్ళు కొవ్వెక్కి సమ్మె చేస్తున్నారని నోరు పారేసుకుంటున్నారని, ఉద్యోగుల సహకారంతో అధికారంలోకి వచ్చిన వైసిపి అహంకారంతో మదమెక్కి మాట్లాడుతున్నారని వీరికి తగిన రీతిలో ఉద్యోగస్తులు రాను నేను ఇలా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని నాగ జగదీష్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు నాగ శేషు సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ శంకర్రావు పరవాడ సిఐటియు గనిశెట్టి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడారి కిషోర్ కుప్పిలి జగన్ మల్ల గణేష్ కాండ్రేగుల సత్యనారాయణ పూడి రమణ తదితరులు పాల్గొన్నారు.//