రావూరి సుధ, సన్మానించిన కొత్తపేట బిజెపి కార్యకర్తలు

రావూరి సుధ, సన్మానించిన కొత్తపేట బిజెపి కార్యకర్తలు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 కాట్రేని కొన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు రావూరి సుధ కాకినాడ పార్లమెంట్ ఇంచార్జి గా నియమితులు అయిన సందర్భంగా ఈ రోజు కొత్తపేట విచ్చేసిన సుధని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం ఆధ్వర్యంలో కొత్తపేట మండల కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. సుధ 2019 లో పాలకొల్లు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేయడం తో పార్టీలో అనేక నామినేటెడ్ పదవులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీయువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ,మండల బీజేపీ అధ్యక్షుడు పాలాటి మాధవ స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దెo శెట్టి శ్రీనివాసరావు, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, sc మోర్చా జిల్లా కోశాధికారి బల్ల రాజు,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఇళ్ల పల్లంశెట్టి, భమిడి పాటి లక్ష్మీనారాయణ, కంకటల నాని,ధర్నాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.