భర్తను చితక్కొట్టిన భార్య.. పాపం భర్త..! ఏలా కొడుతోందో మీరే చూడండి.(వీడియో చూడండి)

జనం న్యూస్: ఉద్యోగంలో అలసిపోయి ఇంటికి వచ్చిన భర్త .. భార్య చేతితో మంచి టీ, కాఫీ లేదా స్నాక్స్, డిన్నర్ తినాలని కోరుకుంటారు. ఇంటి కెళ్లగానే భార్య నవ్వుతూ పలకరిస్తే స్వాంతన పొందుతాడు. ఆఫీసులో ఉన్న టెన్షలన్నీ మర్చిపోతాడు. ఆమె ప్రేమగా చూస్తే కష్టాలన్నీ మర్చిపోతాడు. సాధారణంగా భార్య..హౌజ్ వైఫ్‌గా ఉంటే జరిగేది ఇదే. ప్రతి రోజు ఇంట్లో దినచర్యగా ఇవే జరుగుతుంటాయి. వారి మధ్య గొడవలు ఉన్నాయంటే.. సాయంత్రానికి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. రోజూ ప్రేమగా చూసే భార్య.. మూతి ముడుచుకుని మాటలు లేకుండా కొన్ని పనులు చక్కబెడుతుంటోంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే భర్త.. తన భార్య నుండి ఊహించని తీరును ఎదుర్కొన్నాడు. ఉద్యోగం నుండి వస్తూ వస్తూనే భార్య చేతిలో దెబ్బలు తిన్న భర్త వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎంతలా అంటే ఐదు నిమిషాలకొకసారి వ్యూస్ మారిపోయేంతలా. ఈ వీడియోలో భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నాడు భర్త. అందులో భర్త ఆఫీసు నుండి అర్థరాత్రి ఇంట్లోకి వస్తాడు. తన తల మీద ఉన్న హెల్మెట్ తీస్తూ గది వైపు చూస్తాడు. ఊహించిన ఉపద్రవంలా భార్య దూసుకుంటూ వచ్చి అమాంతంగా భర్తపై పిడిగుద్దులను కురిపిస్తుంది. వంగో పెట్టి మరీ మోచేయితో ఓ వైపు, కాలితో మరో వైపు తన్నుతూ.. తన ప్రస్టేషన్ అంతా తీర్చుకుంటుంది. ఆమెను ఆపేందుకు ప్రయత్నించలేదు సరికదా..తిరిగి కొట్టేందుకు కూడా ముందుకు రాలేదు సదరు భర్త.ఆమె కాసేపు ఆపి చివరకు రెండు దెబ్బలు కొట్టి, చివరకు భర్తకు వార్నింగ్ ఇచ్చింది. అప్పటికీ ఆ దెబ్బలు తిని కూడా ఏం జరగనట్లు చెప్పులు విడిచి, పక్కకు వెళ్లిపోయాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ ఏడాది జనవరిలో ఈ ఘటన జరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వీడియోను నాలుగు మిలియన్స్ మందికి పైగా చూశారు. విపరీతంగా షేర్ అయినట్లు కనిపిస్తోంది. మరీ ఆలస్యంగా ఇంటికి వచ్చాడనో, మరో ఇతర కారణాలో తెలియదు కానీ భర్తను రఫ్పాడించేసింది భార్య. వీపు విమానం మోత మోగించేసింది. ఈ వీడియోను చూసిన చాలా మంది ఫన్నీగా, మరికొంత మంది దారుణమంటూ కామెంట్లు పెడుతున్నారు.