ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన మహిళ..! ఆ తరువాత భర్త ఎం చేశాడు అంటే..? (వీడియో చూడండి)
జనం న్యూస్: ఆమెకు గతంలో ఓ వ్యక్తితో పెళ్లైంది. అయినా సరే భర్తను కాదని మరో మగాడితో ప్రేమాయణం కొనసాగించింది. మొగుడికి తెలియకుండా ఈ వ్యవహారాన్ని చాలా కాలం నుంచి సీక్రెట్ గా మెయింటెన్ చేస్తూ వచ్చింది. ఇక సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో సినిమాలు, షికారులకు తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసింది. అయితే ఇటీవల మరోసారి భర్తకు తెలియకుండా ప్రియుడిని కలిసింది. అదే సమయానికి ఆమె భర్త ఎదురొచ్చాడు. భార్య ప్రియుడితో ఉండడం చూసి షాక్ గురయ్యాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్ గఢ్ పరిధిలోని ఓ ప్రాంతంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే ఆ వివాహిత భర్తను కాదని పరాయి మగాడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ లో మునిగితేలేది. ఇకపోతే.. ఆ మహిళ ఇటీవల భర్తకు తెలియకుండా బయటకు వెళ్లి ప్రియుడిని కలుసుకోవాలని భావించింది. తాను అనుకున్నట్లుగానే ఆ మహిళ బయటకు వెళ్లి సబల్ ఘర్ ప్రాంతంలోని ఓ మార్కెట్ వద్ద ప్రియుడితో మాట్లాడుతూ ఉంది. అక్కడే ఉన్న ఆమె భర్త ప్రియుడితో ఉండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. కోపంతో ఊగిపోయి వెంటనే భార్యను కర్రతో చితక్కొట్టాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు దీనిని వీడియోలు తీసుకున్నారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అనంతరం ఆమె భర్త పోలీసులను ఆశ్రయించడంతో విచారణ మొదలు పెట్టారు.