నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ

నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట  ముంచిన కాంగ్రెస్ పార్టీ

జనం న్యూస్ 16 ఏప్రిల్ 2024 :

బిఆర్ఎస్ పాలనలో  ఆనాడు కరువు వచ్చినా... కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీళ్లు తెచ్చాం,
వద్దురో నాయనో కాంగ్రెస్ సర్కార్ అంటున్న ప్రజలు,,సంక్షేమ పథకాలకు పాతరేసి హైకమాండ్ కు కప్పం కడుతున్న రేవంత్..
 పరిపాలన గాలికొదిలేసి కండువాలు కప్పేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్న సీఎం..మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు,,
నడిగడ్డ జలదీక్ష కు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వైయస్సార్ చౌరస్తా నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిగడ్డ జల దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు , మరియు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అల్లంపూర్ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు, నాగర్ కర్నూల్ పార్లమెంట్  అభ్యర్థి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిలాష రావు గారు హాజరయ్యారు..

  గద్వాల ఎమ్మెల్యే గారికి మాజీ మంత్రివర్యులు, అల్లంపూర్ ఎమ్మెల్యే గారు ,ఎంపీ అభ్యర్థి గారు చేతుల మీదుగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు..


   ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...

పదేళ్లలో కెసిఆర్ గారి పాలనలో రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. మళ్లీ 100 రోజుల కాంగ్రెస్ పాలల్లో రైతులకు ఎన్నో ఇబ్బందుల ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది రైతులకు సరైన కరెంటు లేక పొలాలకు సరైన నీటి సౌకర్యం లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి రావడం జరిగింది. కృష్ణ నది భూగర్భ జలాలు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఎండాకాలం రైతులు ప్రజలకు తాగడానికి నీళ్లు లేని దుస్థితి మల్లొకసారి రాష్ట్రంలో పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల కోసం నీళ్ల కోసం ఈ నడిగడ్డ జల దీక్షను చేపట్టడం జరిగింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వానికి కన్నులు తెరుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది వెంటనే కర్ణాటక రాష్ట్రం నుండి  నారాయణపురం డ్యాము నుండి జూరాల రిజర్వాయర్లు కృష్ణా నది కి ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ దీక్షను చేయటం జరిగింది త్వరగా రైతులకు నీళ్లు విడుదల చేసి ప్రయత్నం చేయాలి లేకపోతే భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు చేయడానికి సిద్ధమై ఉంటామని తెలిపారు.

  పదేళ్లలో కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే ఈ 100 రోజు కాంగ్రెస్ పాలనలో ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని మన కళ్ళు ఎంత కనబడుతుందని స్పష్టం చేశారు.

  ఎంపీ అభ్యర్థి గారు మాట్లాడుతూ....

కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి అధికారం చేపట్టుకుంది. కెసిఆర్ గారి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నది అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సంక్షేమాన్ని అభివృద్ధిని అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని గర్వంగా చెప్పారు.

  రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఒకటే ఒకటి ప్రజలకు మోసం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేకమైన హామీలను చేశారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు గాని ఒక్క వారంటీ కూడా లేక పోతుంది వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు  మాయమాటలు చెప్పి అధికారం  చేపట్టారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని 9వ తేదీ నాడు వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తానన్నాడు నేటికీ చేయలేకపోయారు రైతులకు రైతుబంధును 15000 రూపాయలను ఇస్తామన్నారు మహిళలకు 2500 ఇస్తామన్నారు గ్యాస్ సిలిండర్ 500 కే అన్నారు విద్యుత్ 25 వరకు ఉచితం అన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు మళ్లీ ఇప్పుడు ఎంపీ ఎన్నికలలో ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపియడని ఏ ముఖం పెట్టుకొని ఓటు అడిగే పరిస్థితి ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేకపోయారు. అదేవిధంగా బిజెపి కేంద్రంలో అధికారం నుండి పదేళ్లలో తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు కేసీఆర్ పై స్వార్థం తో కేసీఆర్ ని ఓడించాలని కాంగ్రెస్తో కొమ్మక్కు కావడం జరిగింది కేసీఆర్ బిడ్డను ఈ డి కేసులలో జైలుకు పంపించడం జరిగింది. రైతులను కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో వారికి తగిన బుద్ధి చెప్పాలి అని అన్నారు.

 రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు అయితే రైతుల కోసం రైతుల ఎండిపోయిన పంటలను పరిశీలిస్తుంటే నడిగడ్డ కష్టాలు తెలిసిన నాయకుడు కృష్ణన్న ఎమ్మెల్యే గారు రైతుల కోసం సాగునీరు అందించాలని కర్ణాటక ప్రభుత్వం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వెంటనే కృష్ణ రిజర్వాయర్లు నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేయడం పట్ల ప్రజల పట్ల రైతులు కోసం అహర్నిశలు శ్రమించే నాయకులను లాంటి నాయకుడు నడిగడ్డ ప్రాంతంలో ఉండడం చాలా గర్వించే విషయమని అన్నారు.

  మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ...


60 ఏళ్ల కాంగ్రెస్ పాలన మరొక్కసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పనితీరు పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. పదేళ్ల కెసిఆర్ గారి పాలనలో ఏనాడు కూడా రైతులు ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు తాగునీరు 24 గంటల కరెంటు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు కాబట్టి ప్రతి అన్ని వర్గాల ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని గర్వంగా చెప్పారు.

 ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా తెలంగాణలో వ్యవసాయ రంగం అగ్రస్థానంలో నిలిచి నిలిచే విధంగా కృషి చేశారు ఆనాడు పాలమూరు జిల్లాలో కరువు కాటకాలకు నిలమైనది కానీ కెసిఆర్ గారి పాలనలో పచ్చని పాలమూరుగా  మార్చారు. మళ్లీ ఇప్పుడు పాలమూరు పరిస్థితి కరువు కాటకాలకు నిలయమయ్యే పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏర్పడేస్తుందని అన్నారు. 


 కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఎన్నో పథకాలను అమలు చేస్తాము ప్రజలకు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అంటూ మాయమాటలు చెప్పి అధికారం చేపట్టారు 100 రోజులు దాటిపోయినది ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేకపోయారు కావున వారికి భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.

 గద్వాల ఎమ్మెల్యే గారు చేపట్టే ఈ జల దీక్షకు చూసి అయినా రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి నడిగడ్డ ప్రాంతానికి నీళ్లు విడుదల చేసే విధంగా కృషి చేయాలి లేకపోతే ఎంత ఉద్యమానికైనా సిద్ధమవుతామని నడిగడ్డ నుండి కర్ణాటకలో ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేయడానికి మేము రైతు పక్షాన ప్రజల పక్షాన సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.  


 మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ...


తెలంగాణలో మార్పంటూ కాంగ్రెస్ పార్టీ కరువు తెచ్చిందని విమర్శించారు. 

కాంగ్రెస్ పాలనలో సంక్షేమ కిట్లు బంద్ పెట్టి.. తిట్లు ఫుల్  గా పెంచారని ఎద్దేవా చేశారు

అంకుశంతో పొడిచి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు గద్వాలలో జలదీక్ష చేపట్టినట్లు చెప్పారు 

ప్రభుత్వం వెంట పడుతాం.. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు లు పూర్తి చేయిస్తాం 

కెసిఆర్ గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కృషి వల్ల గద్వాలలో 1.47లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు ఓట్లకు వస్తే కళ్యాణ లక్ష్మి జ్ షాదీ ముబారక్, రైతు బందు, రైతు బీమా, పింఛన్లు, రుణమాఫీ వంటి పథకాలను బంద్ పెట్టినందుకు మహిళలు చీపురు పట్టి తరిమి కొట్టాలి

రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ లేదు 

బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రస్తుత అధ్యక్షులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలు తమ ఉనికి కోసం పోటాపోటి దీక్షలు 

నల్ల చట్టాలతో 700మంది రైతులను పొట్టన పెట్టుకున్న బీజేపీ పార్టీ రైతు దీక్ష చేయడం సిగ్గుచేటు

దమ్ముంటే బీజేపీ నాయకులకు రుణ మాఫీ చేయండి.. పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వండి

చేతకాని సీఎం పాలన వల్ల మళ్ళీ రాష్ట్రం 20 ఏళ్ళు వెనుకబడింది.

 

????ఈ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, రైతులు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా