|భద్రత ప్రమాణాల పట్ల అవగాహన, ఆచరణతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యం

|భద్రత ప్రమాణాల పట్ల అవగాహన, ఆచరణతోనే ప్రమాదాల నియంత్రణ సాధ్యం

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 23 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
రహదారి భద్రత ప్రమాణాలు పట్ల అవాహన, ఆచరణతోనే జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ డిసెంబరు 22న అన్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పించి, భద్రత చర్యలుచేపట్టాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - రహదారి ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా భద్రత చర్యలను చేపట్టాలన్నారు. ఇందులో భాగంగా వాహనదారులకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలను, పెద్ద ప్రమాదాలు జరిగినప్పటికీ స్వల్ప గాయాలతో ఎలా ప్రాణాలతో సురక్షితంగా భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలన్నారు. హెల్మెట్స్ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో గాలి, దుమ్ము నుండి రక్షించడంతోపాటు, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. ఊహించని రహదారి ప్రమాదాల నుండి రక్షించే రక్షణ రేఖ హెల్మెట్ ధారణ అని అన్నారు. కావున, ప్రతీ వాహనదారుడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో నాణ్యత కలిగిన సరిగ్గా అమర్చిన హెల్మెట్స్ ను ధరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులను ఆదేశించారు.ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగు నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటారు వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపై కఠినంగా వ్యవహరించి, కేసులు నమోదు చేయాలన్నారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై దాడులు చేపట్టి, ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలకు రహదారి ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తునే, మరో వైపు ఎం.వి. నిబంధలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఇప్పటికే ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రహదారి ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్స్ కు ఇరువైపుల కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లు అతికించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. హెల్మెట్స్ ధరించని వారిపై ఈ సంవత్సరంలో ఇప్పటికే 35,204 మందిపై ఎం.వి. చలానాలను విధంచామన్నారు.