జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం.. తీవ్ర గాయాలు. ఎలా జరిగిందంటే..!
జనం న్యూస్: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్‌ను చిత్ర యూనిట్ హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమాలోని రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే దేవర సినిమా షూటింగ్ సమయంలో ఇది రెండో ప్రమాదం. గతంలో మోదకొండమ్మ పాదల వద్ద షూటింగ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. ఎన్టీఆర్‌కు గాయాలు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.