స్కూటి నడపడమే కాదు బ్రేక్ వేయడం కూడా రావాలి అక్కా.. మాల్ లోపలికి స్కూటితో దూసుకొచ్చిన మహిళ

జనం న్యూస్: కొందరు వాహనాల డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటే.. మరికొందరు డ్రైవింగ్‌పై సరైన అవగాహన లేక ఊహించని ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. వేయాల్సిన చోట బ్రేక్ వేయకపోవడంతో చివరకు ఏం జరిగిందో చూడండి.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ సూపర్ మార్కెట్ ఎదురుగా కొందరు నిలబడి ఉంటారు. ఇంతలో ఓ యువతి స్కూటీపై అక్కడికి వస్తుంది. షాపు ఎదురుగా బ్రేక్ వేయాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ఎక్సలేటర్‌ను రైజ్ చేస్తుంది. దీంతో ఆ స్కూటీ రయ్యిన షాపులోకి దూసుకెళ్తుంది. దీంతో సూపర్ మార్కెట్ ఎదురుగా నిలబడ్డ వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్కూటీపై లోపలికి వెళ్లిన యువతి దుకాణంలోని ప్లాస్టిగ్ సమాన్లను ఢీకొంటూ దూసుకెళ్తుంది. చివరకు ఓ పెద్ద ఇనుప్ స్టాండ్‌ను ఢీకొని ఆగిపోతుంది. దీంతో అక్కడున్న యువతులంతా పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పైకి లేపి పక్కకు తీసుకెళ్తారు. ఇలా సదరు యువతి స్కూటీ నడపడంపై అవగాహన లేక ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''అవగాహన లేక డ్రైవింగ్ చేస్తే ఇలాగే ఉంటుంది''.. అంటూ కొందరు, ''రోడ్డులో ఇలా జరిగితే పరిస్థితి ఏంటి''... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.