మూడో అంతస్తుపై నుంచి దూకేసిన విద్యార్థి.. టీచర్స్ డే రోజు ఘటన (వీడియో చూడండి)
జనం న్యూస్: అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ స్టూడెంట్ చేసిన పనికి షాక్ అయ్యారు. అందరూ టీచర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నారు.. స్కూల్లో ఉపాధ్యాయులను పూజించుకుంటుండగా జరిగిన ఘటన ఒక్కసారిగా విద్యార్థుల్లో విషాదాన్ని నింపింది. రన్నింగ్ చేస్తూ వచ్చి మరి స్టూడెంట్ థర్డ్ ఫ్లోర్ పైనుంచి దూకాడు. వెంటనే 200 మంది విద్యార్థులు అక్కడ గుమికూడారు. స్కూల్ అంతా గంధరగోళంగా మారింది. బాలుడు దూకడం తోటి విద్యార్థులు ఫోన్ లో వీడియో తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అస్సాంలో ఓ విద్యాసంస్థలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంజరుపుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది. అస్సాంలోని పాత్సాలాలోని అనుండోరం బోరూహ్ అకాడమీలో విద్యార్థి థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. క్లాస్ రూంలోని కిటికీ నుంచి ఓ విద్యార్థి బయటకు వచ్చాడు. మూడవ అంతస్థలో ఎలివేషన్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కిందకి దూకాడు. దీంతో అక్కడ టీచర్లు, స్టూడెంట్లు షాక్ గురైయ్యారు. వెంటనే అక్కడ 200 మంది విద్యార్థులు గుమిగూడారు. విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. అకాడమీ అంతా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. స్టూడెంట్ మూడో అంతస్థూ పైనుంచి దూకడాన్ని తోటి విద్యార్థులు వీడియో తీశారు. ప్రస్తుతం వీడియో ఎక్స్‌లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు విద్యార్థి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఎందుకు అలా చేశాడో తెలియదు. కానీ.. ప్రస్తుతం డాక్టర్లు అతనికి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. టీచర్స్ డే రోజే ఇలా జరగడంతో చాలామంది ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఇది బాధ కలిగిస్తోంది. వీడియో చూసిన వారందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.