ఆ హీరోతో కండోమ్ యాడ్ లో రెచ్చిపోయిన నాగచైతన్యకు కాబోయే భార్య..(వీడియో చూడండి)

జనం న్యూస్: ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభిత 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. ఆ తర్వాత నటిగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. శోభిత ధూళిపాళ అవడానికి తెలుగు అమ్మాయి అయినప్పటికి బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.గూడాచారి, మేజర్ , మూతోన్ కురుప్ పొన్నియిన్ సెల్వన్ ,మేనేజర్ వంటి సినిమాల్లో నటించింది. మంకీ మ్యాన్ (2024)తో అమెరికన్ సినిమాలో కూడా నటించింది. ఇదే సమయంలో నాగ చైతన్య ఎఫైర్ కూడా శోభిత ధూళిపాళను వార్తల్లో నిలిచేలా చేసింది. సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావించారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్‌గా రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. అభిమానులకు షాకిస్తూ గురువారం అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. ఇదిలా ఉంటే గతంలో శోభిత ధూళిపాళ చేసిన కండోమ్ యాడ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి శోభిత ధూళిపాళ ఓ కండోమ్ యాడ్ చేసింది.నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభితా ధూళిపాళ చేసిన కండోమ్ యాడ్ గురించి ఎక్కువ మంది ట్వీట్స్ చేస్తున్నారు. ఓ వర్గం ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.