ఘనంగా ప్రారంభమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) రాష్ట్ర 49వ మహాసభలు

ఘనంగా ప్రారంభమైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య  (AISF) రాష్ట్ర 49వ మహాసభలు

జనం న్యూస్ 28 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం  పట్టణంలో  ఏఐఎస్ఎఫ్  49వ రాష్ట్ర మహాసభల సందర్భంగా చేపట్టినటువంటి ర్యాలీ, బహిరంగ సభలను జయప్రదంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా  బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు గారి అధ్యక్షతన వహించగా  ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీ రంగరాజ్ మరియు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం వలన లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని , విద్యార్థుల మెదడుల్లోకి  మతోన్మాదాన్ని నింపి విద్యార్థుల మధ్య మత ఘర్షణలను పెంచి పోషిస్తున్న ప్రభుత్వానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి భవిష్యత్తులో విద్యార్థులు చెప్పాలని అన్నారు. దీనిని అడ్డు కోవాలంటే కేవలం శాస్త్రీయ విద్యా విధానం వలనే జరుగుతుందని అన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి  ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తుందని, పేదల ఆకలి తీర్చకుండా అంబానీ,  అదానీలా కుటుంబ ఆస్తులను పెంచడానికి పనిచేస్తుందని దేశ సంపదనంతా  వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అధికారులకు రాకముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయినా కూడా నిరుద్యోగులకు  లక్ష ఉద్యోగాలను కేటాయించ కుండా నిరుద్యోగులను మోసం చేసిందని వాపోయారు. 32 మంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో,  67 మంది వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు,  ఎంపీలు పదవి త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ వ్యక్తులకు  తెగనమ్ముతున్నారని అన్నారు. విశాఖ ప్రైవేటుకరణం కావడంవల్ల రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఉపాధి కోల్పోతారని వారి కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడంలో విద్యార్థులు ముందుండాలని  పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు అభివృద్ధి విషయంలో, బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్రలో  విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా వాటి అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని వాపోయారు.  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఈ అఖిల భారత విద్యార్థి సమాఖ్య 49వ రాష్ట్ర మహాసభలల్లో నూతన పోరాట పందాను ఏర్పాటు చేసుకొని ముందుకు కొనసాగాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు  కామేశ్వరరావు గారు,  ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు నక్కి లేని బాబు , మహంకాళి సుబ్బారావు, పరుచూరి రాజేంద్ర, బుగత అశోక్ , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కే శివారెడ్డి, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ షేక్ మస్తాన్, ఫణింద్ర కుమార్,  బండి చలపతి ,  బందెల నాసర్ జీ, నాగభూషణ్,  కుల్లాయి స్వామి, వల రాజు, సాయికుమార్, షాబీర్ భాష, రాష్ట్ర ప్రజానాట్యమండలి  నాయకులు చంద్ర నాయక్ , పెంచలయ్య, రామకృష్ణ రామారావు, తదితర విద్యార్థులు పాల్గొన్నారు.