అన్ని స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయండి: విజయనగరం కలెక్టర్‌

అన్ని స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయండి: విజయనగరం కలెక్టర్‌

జనం న్యూస్ 27 అక్టోబర్ 
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలో సెక్స్‌ రేషియో తగ్గడంతో అన్ని స్కానింగ్‌ కేంద్రాలను పోలీస్‌, ఋదొ లు కలసి తనిఖీ చేయాలని విజయనగరం కలెక్టర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. వైద్య సిబ్బందితో శనివారం సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 1,000 మంది మగ శిశువులకు 918 మంది ఆడ శిశువులు నమోదు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపోర్టింగ్‌ తప్పా లేక స్కానింగ్‌ కేంద్రాల్లో తప్పులు జరుగుతున్నాయా అనే విషయాలపై తనిఖీలు చేయాలన్నారు.