టై, బెల్టు, బ్యాడ్జీలు విద్యార్థులకు వితరణ చేసిన దాత అద్దంకి అనిల్
*ముఖ్య అతిథులుగా ఎస్ డి ఎస్ అధ్యక్షులు వీరస్వామి.
*మాజీ ఎంపీటీసీ కొండూరి కిరణ్.
*మాజీ వార్డు సభ్యులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు.
కల్లూరు (అక్టోబర్ 29), సామాజిక తెలంగాణ.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు పట్టణంలోని గల కలాలివాడ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు ప్రభుత్వ యూనిఫామ్ ఉండి టై, బెల్టు ,బ్యాడ్జీలు లేని విషయాన్ని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక సమావేశంలో తెలుపుగా, అందుకు స్పందించిన అద్దంకి అనిల్ స్కూల్ పిల్లలకు టై బెల్ట్ బ్యాడ్జిలను ఉపాధ్యాయుల సమక్షంలో వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి గాను మాజీ ఎంపీటీసీ కొండూరు కిరణ్, శాంతినగర్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఖమ్మంపాటి వీరస్వామి, మాజీ వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సరైన టైం కి పాఠశాలకు చేరుకొని అటు స్కూలుకి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని అలాగే ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగానే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నారని పిల్లలు మంచిగా చదువుకొని వారి భవిష్యత్తును ఉన్నతంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా కోరారు. స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు టై ,బెల్టు, బాడ్జిలను వితరణ చేసిన అద్దంకి అనిల్ కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొండూరు కిరణ్, మాజీ వార్డు సభ్యులు వెంకటేశ్వర్లు, ఎస్ డి ఎస్ కార్యవర్గ సభ్యులు ఖమ్మంపాటి వీరస్వామి, ఖమ్మంపాటి శ్రీనివాసరావు, కనకపుడి జయరాజు, అద్దంకి అనిల్, కొత్తపల్లి వీరేందర్, మేడి సీతారాములు, రావూరి సీతారాములు, కిన్నెర నాగరాజు, ప్రసన్న కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.