పాపాత్ములను శిక్షించండి- సనాతన ధర్మాన్ని రక్షించండి
జనం న్యూస్ జూలై 25 (అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ)
తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ఆరాధ్య దైవం అఖిలాండ బ్రహ్మాండకోటి నాయకుడు శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపచారం చేసిన వైసిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఈరోజు స్థానిక 81 డివిజన్ శ్రీవారి భక్తులు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శిబిరానికి మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలియజేసి పరమ పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండర్ లో కాసులకు కక్కుర్తి పడి హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ప్రపంచ హిందువులకు కళంకం తీసుకొచ్చారని ఇటువంటి నీచ నికృష్టులను చరిత్ర హీనులుగా నిలబెట్టే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవాలని తిరుమలలో అన్య మతస్తులు ఉద్యోగాలు చేస్తున్న వారిని తిరుపతి పరిపాలన పరిపాలన కార్యాలయాలకు పరిమితం చేయాలని తిరుమలలో దళారీలను లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని నాగ జగదీష్ కోరారు. ఈ కార్యక్రమంలో కాండ్రెగుల శ్రవణ్ బొడ్డెడ అప్పలనాయుడు కాండ్రేగుల హనుమంత్, బుధప్రసాద్ కొణతాల బాలాజీ బోడ్డెడ అయ్యప్ప ప్రదీప్ రవి మోహన్ అఖిల్ గోపి ప్రభు హర్ష,సాయి, శ్యాతన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.//