పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగారం||
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 18 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్లో 2020 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన ఐతి అప్పల నాయుడు (28సం.లు)కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 4,000/-లు జరిమానా విధిస్తూ డిశంబరు 16న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ డిశంబరు 16న తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా మెంటాడ మండలానికి చెందిన ఒక బాలిక విజయనగరం పట్టణంలోఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో విశాఖపట్టణం జిల్లా పద్మనాభ మండలం, పొట్నూరు గ్రామానికి చెందిన నిందితుడు ఐతి అప్పనాయుడు (28 నం||లు) అనే ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పడినట్లు, నిందితుడు బాలికను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తన ఆటోలో వేరువేరు ప్రాంతాలకు తీసుకువెళ్ళి పలుమార్లు శారీరకంగా అనుభవించినట్లు విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి విజయనగరం డిఎస్పీ పి.వీరాంజనేయ రెడ్డి దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి,కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్ చర్యలు చేపట్టగా, నిందితుడు ఐతి అప్పల నాయుడు (28సం.లు) మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడికి 20సం.లు కఠిన కారాగారం, రూ.4,000/- ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మావూరి శంకరరావు వాదనలు వినిపించగా, విజయనగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ ఎన్.శ్రీనివాస్ పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ ఎల్.త్రిమూర్తుల, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్. రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరుపర్చారన్నారు.పోక్సో కేనులో త్వరితగతిన నిందితుడికి శిక్ష వడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.