|గంజాయి అక్రమంగా కలిగిన ఇద్దరు నిందుతులు అరెస్టు||

|గంజాయి అక్రమంగా కలిగిన ఇద్దరు నిందుతులు అరెస్టు||

- విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్
జనం న్యూస్ 18 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
తే 17-12-2024 దిన విజయనగరం 1వ పట్టణ పోలీసులకు కొంతమంది వ్యక్తులు గంజాయి అక్రమంగా కలిగినట్లుగా వచ్చిన సమాచారంతో 1వ పట్టణ ఎస్ఐ వి.ఎల్ ప్రసన్న కుమార్ మరియు సిబ్బంది విజయనగరం పట్టణంలో ని గూడ్స్ షెడ్ వద్ద ఇద్దరు అనుమానిత వ్యక్తులను పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద సుమారు రెండు కేజీల గంజాయి ప్యాకెట్టు దొరికినవి. సదరు వ్యక్తులను విచారించగా వారు విజయనగరం పట్టణానికి చెందిన (1) సప్ప పవణ్ కళ్యాణ్ వయస్సు 24 సం||లు, ఉడాకాలనీ, మరియు (2) యలగడ మురళీ, వయస్సు 31 సం||లు, వి.టి. అగ్రహారం అని తెలిపారు. ఈ ఇరువురు పాత నేరస్తుల వద్ద గంజాయి కొనుక్కొని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి, పట్టణంలో పలు ప్రాంతాల్లో అమ్ముతుంటామని తెలిపారు. ఇదే విధంగా ఈ దినం అనగా తే. 17-12-2024 దిన ఉదయం విజయనగరం గూడ్స్ షెడ్ వద్ద గంజాయి అమ్ముతుండగా పక్కా సమాచారంతో పట్టుకుని, కస్టడీలోకి తీసుకుని వారిని ఇద్దరు విఆర్ ఓలు ఆధ్వర్యంలో తనిఖీ చేసి, వారి వద్ద నుండి రెండు కేజీల గంజాయిని సీజ్ చేసి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండు నిమిత్తం కోర్టుకు తరలించడం అయ్యిందని విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.