అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని*          *కన్న కొడుకు ని చంపిన కసాయి తల్లి

అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని*          *కన్న కొడుకు ని చంపిన కసాయి తల్లి
అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని*          *కన్న కొడుకు ని చంపిన కసాయి తల్లి
కేసును  చాకచక్యంగా  చేదించిన పటాన్చెరు పోలీసులు*
జనం న్యూస్ జూన్ 16 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పోలీసు స్టేషన్ పరిధిలోని ముత్తంగి ఓ ఆర్ ఆర్  సర్వీస్ రోడ్ నుండి కర్దనూర్ గ్రామానికి మార్గమధ్యంలో సర్వీస్ రోడ్ రాంకీ కన్ స్ట్రక్షన్ ప్రక్కన, క్యాండీ డస్ ఇంటర్ నేషనల్ స్కూల్ దగ్గరలో  ఉదయం  09.00 గంటలకు గుర్తు తెలియని బాలుని శవము చెట్ల పొదలలో పడి ఉండగా ముత్తంగి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పటాన్ చేరు క్రైమ్ ఇన్స్ పెక్టర్ కేసు నమోదు చేసి డి.ఎస్.పి రవీందర్ రెడ్డి పటాన్ చేరు  పర్యవేక్షణలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, అట్టి గుర్తు తెలియని బాలుని ఆచూకీ గురించి పలు పత్రిక ప్రకటన, సోషల్ మీడియాలో మరియు అన్నీ వాట్సాప్ గ్రూప్ లలో షేరింగ్ చేయగా  13 వ తేదీ రోజు గుర్తు తెలియని బాలుని ఆచూకీ తెలిసినది. ఆ మృతుని  పేరు  కర్రే విష్ణువర్ధన్ 8 సం|| రామచంద్రపురం వాసిగా  గుర్తించారు. అట్టి బాలుడు నివాసము ఉంటున్న ఇంటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉన్నది. విష్ణువర్ధన్  మరణం వెనుక అతని కన్న తల్లే హంతకురాలు అని తెలిసి ఆమెను మరియు ఆమె రెండవ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా  కన్నతల్లే తను చేయుచున్న అక్రమ సంబందాలకు అడ్డుగా వస్తున్నాడని అడ్డు తోలగించుకొనుటకు గాను కన్న కొడుకును పోల్కంపేట గ్రామానికి చెందిన కర్రేస్వాతి 10వ తేదీ సాయంత్రము 5.30 గంటల సమయమున గొంతు నులిమి చంపి, తను రెండవ  భర్త  అనిల్ ను నమ్మించడానికి ఉరివేసుకొని చనిపోయాడని  చెప్పి, ఇద్దరు కలిసి ఆశవాన్ని వారి స్కూటిపై తీసుకొని వచ్చి ముత్తంగి గ్రామ శివారులోని ఓ ఆర్ ఆర్ సర్వీస్ రోడ్ ప్రక్కన చెట్ల పొదలలో రాత్రి 11.30 గంటల సమయమున పడవేశామని పోలీసుల విచారణలో తెలిపారు. పాత రామచంద్రపురం టౌన్ లో నివసిస్తున్న దొంతుఅనిల్ నీ 14 తేది రాత్రి అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు 15వతేది పంపించారు ఇట్టి కేసులో  నిందితులను  చాకచక్యంగా  పట్టుకొనిన పటాన్ చేరు సీఐ ప్రవీణ్ రెడ్డి, క్రైమ్ సీఐ రాజు ,క్రైమ్ సిబ్బందిని డిఎస్పి రవీందర్ రెడ్డి అభినందించారు.