:జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నేడు చిలిపి చెడుమండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
జనం న్యూస్ నవంబర్ 21 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో 2024 ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల చిలిప్చేడ్ నందు ఈ రోజు నిర్వహించడం జరిగింది. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వేదశ్రీ పరీక్ష పత్రాలను విడుదల చేయడం జరిగింది. అనంతరం విద్యార్థి దశనుండే శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని మూఢనమ్మకాలను పారాదోరాలని సైన్స్ మన జీవితంలో భాగం అని అన్నారు. ఈ పరీక్షలో మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 8,9,10 తరగతుల నుండి ఒక్కొక్క విద్యార్థి పాల్గొని పరీక్ష రాయడం జరిగింది. మండల స్థాయిలో తెలుగు మాధ్యమంలో ప్రథమ స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫైజబాద్ ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతాపూరు తృతీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేట్ నిలిచాయి. ఆంగ్ల మాధ్యమంలో ప్రథమ స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫైజాబాద్ ద్వితీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండూర్ తృతీయ స్థానంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గౌతాపూర్ లు నిలిచాయి విజేతలకు మండల విద్యాధికారి విట్టల్ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చెకుముకి పరీక్షలను పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయిలో నిర్వహించడం అభినందనీయమని. విద్యార్థులు పాలెం నుండే సైన్స్ ను కృత్యాల ద్వారా భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు, ఈ కార్యక్రమంలో రమేష్, అజయ్ కుమార్, నాగభూషణం, శ్రీనివాస్ జాదవ్, నర్సింలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు