అధ్యాపకుడికి ఘనంగా సన్మానం చేసిన స్ఫూర్తి హోమ్ ట్రస్ట్

అధ్యాపకుడికి ఘనంగా సన్మానం చేసిన స్ఫూర్తి హోమ్ ట్రస్ట్

గంగారం మండలం మహబూబాబాద్ జిల్లా (జనం న్యూస్) నూకల రవీందర్: పెద్దఎల్లపురం గ్రామానికి చెందిన గుండగాని సతీష్ వృక్ష శాస్త్ర అధ్యాపకుడుగా గత 14 సంవత్సరాల నుండి విద్యార్థులకు విద్యాబోధనతోపాటు మూఢనమ్మకాలపై అవగాహన మరియు మన నిత్య జీవితంలో ఉపయోగపడే మొక్కల ఆవశ్యకతను విద్యార్థులకు వివరించడం జరుగుతుంది. విద్యార్థులకు విద్య బోధనలతో పాటు సమాజంపై అవగాహన కల్పించినందుకుగాను టీచర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకొని ది సైంటిఫిక్ సెయింట్ స్ఫూర్తి హోమ్ ట్రస్ట్ మహబూబాబాద్ వారి ఆధ్వర్యంలో గుండగాని సతీష్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. మారుమూల గ్రామాల నుండి ఉపాధ్యాయ వృత్తి యందు అవార్డు అందుకున్నందుకు గాను గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు