కొడకంచి శివప్రసాద్ గౌడ్ నానిపుట్టినరోజు వేడుకలలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

కొడకంచి శివప్రసాద్ గౌడ్ నానిపుట్టినరోజు వేడుకలలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

కొడకంచి శ్రీనివాస్ గౌడ్ తనయుడు శివప్రసాద్ గౌడ్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..

 జనం న్యూస్ సెప్టెంబర్2.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్

 మండల కేంద్రమైన శివంపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేతకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి  శ్రీనివాస్ గౌడ్ - కృష్ణవేణి దంపతుల కుమారుడు కొడకంచి శివప్రసాద్ గౌడ్ ( నాని ) జన్మదిన వేడుకలకు ఆదివారం  నర్సాపూర్ మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శివప్రసాద్ గౌడ్ ( నాని )కు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, అక్షింతలు వేసి దీవించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలని, అప్పుడే తల్లిదండ్రులకు, కుటుంబానికి ఎంతో సంతోషకరమని మదన్ రెడ్డి అన్నారు. శివ ప్రసాద్ గౌడ్ జన్మదిన వేడుకలలో శివంపేట మాజీ ఎంపీటీసీ జంగం విజయ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్, బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్,మంతూరి రమేష్ గౌడ్ మండల పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్, ఉషగొని శంకర్ గౌడ్, గౌడ సంఘం మండల అధ్యక్షులు కొడకంచి రవీందర్ గౌడ్, కొడకంచి గణేష్ గౌడ్, గంగపుత్ర సంఘం అధ్యక్షులు కాముని నాగేష్, గూడూరు హరిబాబు, నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, కౌడిపల్లి సంతోష్, తిమ్మాపూర్ సాయి గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులుతదితరులు పాల్గొన్నారు.