తడ్కల్ లో అంబరానంటిన బిజెపి సంబరాలు
బాణాసంచాలు కాల్చి మిఠాయిలు తినిపించిన బిజెపి నేతలు
జనం న్యూస్,నవంబర్ 24, కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో మహారాష్ట్రలో ఎన్డీఏ 234,స్థానాలను భారీ మెజారిటీతో గెలుపొందడంతో మరో మారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా తడ్కల్ భాజపా శ్రేణులు శనివారం చత్రపతి శివాజీ మహారాజ్ కూడలిలో బాణాసంచాలు కాల్చి మిఠాయిలు తినిపించారు.ఈ సందర్భంగా భాజపా నాయకులు మాట్లాడుతూ భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేయడంలో సఫలీకృతం అయ్యారు కానీ, భారతదేశ ఔన్నత్యాన్ని, సార్వభౌమత్వాన్ని, ఏనాడు పట్టించుకునే పాపాన పోలేదని అన్నారు.2014 లో ఆజాపా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల నేతలు భారత్ వైపు చూసే విధంగా పరిపాలనను అందిస్తూ అనేక రంగాలలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.మహారాష్ట్రలో 2014,లో 122,స్థానాలు 2019,లో 105,స్థానాలు 2024,లో 132, స్థానాలను స్వతంత్రంగా గెలుపొందడం జరిగిందన్నారు. మహారాష్ట్రను మరింత అభివృద్ధి చేసే సత్తా సామర్థ్యం ఖాజాప ప్రభుత్వానికే ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాపార్తి దత్తు సెట్,గుర్రపు సత్యనారాయణ, ముప్పిడి సాయిలు, కాంత రెడ్డి,కాపార్తి ఆంజనేయులు,రమేష్ గౌడ్,సురేష్ గౌడ్,సాయ గౌడ్,దేవిదాస్,గోపాల్ రావు,భాజపా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.