తాటిపూడి జలాశయం దిగువ గ్రామాలను అప్రమత్తం చేయాలి -విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

తాటిపూడి జలాశయం దిగువ గ్రామాలను అప్రమత్తం చేయాలి -విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

జనం న్యూస్ 10 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గంట్యాడ మండలం తాటిపూడి జలాశయాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సెప్టెంబరు 9న సందర్శించి, అనంతగిరి కొండ ప్రాంతాల నుండి వస్తున్న ఇన్ ఫ్లో నీటి ప్రవాహం, తాటిపూడి జలాశయం నుండి విడుదల చేస్తున్న ఔట్ ఫ్లో నా నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. 
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడతూ - అనంతరగిరి కొండ ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పెద్ద ఎత్తున తాటిపూడి జలాశయానికి నీరు వచ్చి చేరుతున్నందున, పరిస్థితిని పరిశీలించేందుకు తాటిపూడి జలాశయాన్ని సందర్శించినట్లుగా తెలిపారు. తాటిపూడి జలాశయం గేట్లు తెరిచినట్లయితే జలాశయం దిగువ ప్రాంతంలో నీటి ప్రభావంకు గురయ్యే గ్రామాలను అప్రమత్తం చేయాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని గంట్యాడ పోలీసులను ఆదేశించారు. తాటిపూడి జలాశయంలో ప్రస్తుతం 295.8 అడుగుల నీటి మట్టం ఉందని, ఇంకా ఎక్కువ మొత్తంలో వరద నీరు వచ్చి జలాశయంలో చేరితే, గేట్లు తెరిచే అవకాశం ఉందని, ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితిలోనే ఉందన్నారు. ప్రస్తుతం జలాశయంలోని ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో రెండు సమానంగానే ఉన్నందున ఇబ్బందులు ఏమీ లేవని నీటిపారుదల అధికారులు జిల్లా ఎస్పీకి తెలిపారు. జలాశయంలోకి అధికంగా నీరు వచ్చి చేరినట్లయితే జామి, ఎస్.కోట మండలాల్లో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, వారిని అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. అనంతరం, జిల్లా ఎస్పీ జలాశయం గేట్లును తెరిచే పైభాగంకు వెళ్లి, జలాశయం గేట్లును పరిశీలించారు.అదే విధంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చెరువులు, కాలువలు, వాగులు పొంగిపొర్లుతున్నందున సంబంధిత పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు చేపట్టేందుకు ఆయా ప్రాంతాల్లో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. విజయనగరం 1వ పట్టణం పరిధిలోని పెద్ద చెరువు, పెదమానాపురం పిఎన్ పరిధిలోని కొండ చెరువు, డెంకాడ పిఎస్ పరిధిలోని గడవని చెరువు, సంతకవిటి పిఎన్ పరిధిలోని మందరాడ పెద్ద చెరువు, తెర్లాం పిఎస్ పరిధిలో మంగలి గెడ్డ, గజపతినగరం పిఎస్ పరిధిలో చంపావతి నది, విజయనగరం రూరల్ పిఎస్ పరిధిలోని జొన్నవలస పెద్ద చెరువు, రేగిడి ఆమదాలవలస పిఎస్ పరిధిలో ఆకుల గెడ్డ, భోగాపురం పిఎస్ పరిధిలోని మహారాజుపేట గ్రామం వద్ద, కొత్తవలస పిఎస్ పరిధిలోని గవరపాలెం గెడ్డ, ఎస్.కోట పిఎస్ పరిధిలోని పోతనాపల్లి ఇసుక గెడ్డల నుండి నీరు పొంగిపొర్లి రహదారులపై నీటి ప్రవాహం ఏర్పడి, వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లుగా జిల్లా పోలీసుశాఖ గుర్తించిందన్నారు. నీటి ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తమై, ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తుఫాను వలన ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 24/7 సహాయం అందించేందుకు పోలీసు కంట్రోల్రూంలో ల్యాండు నంబరు 08922-224455, సెల్ నంబరు 9121109483 లను జిల్లా ఏర్పాటు చేసారు. ఈ ఫోను నంబర్లు నిరంతరం పని చేసి, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు సిబ్బందిని,అధికారులను అందుబాటు ఉంచామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.జిల్లా ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ సిఐ కే.కే.వి.విజయనాథ్, గంట్యాడ ఎస్సై సాయికృష్ణ, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది హాజరుగా ఉన్నారు.