దేవుని పేరుతో రాజకీయాలు..

దేవుని పేరుతో రాజకీయాలు..

 జనం న్యూస్ సెప్టెంబర్ 20 శాయంపేట మండలం బీఆర్ఎస్ పార్టీలో రాజకీయంగా తన ఉనికిని చాటుకోవడానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాకు లాడుతున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని ప్రగతింగారంలో ఇటీవల గణేశుడి శోభాయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై బుధవారం హన్మకొండలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలో నిరసన తెలిపారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. నిమజ్జనంలో జరిగిన చిన్న ఘటనను రాద్ధాంతం చేసి, గొడవలు సృష్టించారని, దీనిపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారని అన్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పనిచేస్తే కాంగ్రెస్ నాయకుల పై కేసులు ఎందుకు నమోదు అవుతాయో గుర్తించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా మైలారం గ్రామంలో గ్రామ పంచాయతీలో వినాయకుడిని ప్రతిష్టిస్తే అధికార బలంతో పోలీసులతో లాఠీచార్జి చేయించి, నవరాత్రులు పూర్తికాకుండానే నిమజ్జనం చేయించి,  పోలీసులు మిమ్మల్ని సంతృప్తిపరిచారా అని ప్రశ్నించారు. మండలంలో దళిత బంధు పథకం ఇప్పిస్తామని దళితుల వద్ద తాజా మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడని, ఈ క్రమంలో ఓ దళితుడి వద్ద లక్ష తీసుకొని అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీపీని సమర్థిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. మాజీ ఎంపీపీ పెద్దకోడేపాక, ప్రగతి సింగారం, కొత్తగట్టు సింగారం గ్రామాలలో పనులు చేయకుండా ఇంజనీరింగ్ అధికారులను బెదిరించి  అవినీతికి పాల్పడ్డాడని, ఎంపీటీసీలు అప్పటి జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఫిర్యాదు చేస్తే తప్పు చేయని వారు ఎవరు ఉన్నారు అని వ్యాఖ్యానించిన మీరు నేడు మాట్లాడడం  వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు చిందం రవి, వైనాల కుమారస్వామి, బోనపల్లి రఘుపతి రెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, నిమ్మల రమేష్, వైద్యుల వెంకటరాజు రెడ్డి, శానం కుమారస్వామి, చిట్టి రెడ్డి జంగారెడ్డి, నిమ్మల రమేష్, మోరే శ్రీను, కందగట్ల రవి, లడే రాజ్ కుమార్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు._