పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు
-ఏస్ఐ. బి.ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ అక్టోబర్ 27 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
ఆటో డ్రైవర్లు ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మునగాల ఎస్ఐ బి.ప్రవీణ్ కుమార్ ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఆదివారం జాతీయ రహదారి 65పై మండల పరిధిలోని బరాఖత్ గూడెం అవస గ్రామమైన శ్రీనివాస్ నగర్ కాలనీ వద్ద ఆటోలను తనిఖీ నిర్వహించారు. పరిమితికి మించి ప్రయాణికులను తరిస్తున్న తొమ్మిది ఆటోలపై కేసును నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని ప్రమాదాలకు గురికావద్దని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు.నలుగురు ఎక్కవలసిన ఆటోలో 16 మంది కూలీలు ప్రయాణిస్తుండడంతో కూలీలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు.గతంలో ఆటోలలో పరిమితికి మించి ప్రయాణిస్తున్న కూలీలకు జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి వారికి వివరించారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శివ, ఖాజా పాల్గొన్నారు.