పల్లె పండుగ’తో గ్రామాల అభివృద్ధి
చింతపల్లి పయనించే సూర్యుడు :- పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ‘పల్లె పండుగ’ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం
అల్లూరి జిల్లా పాడేరు నియోజవర్గం చింతపల్లి మండలం లమ్మసింగి పంచాయతీ లబ్బంగి కొత్త వీధి గ్రామంలో పల్లె పండుగ ప్రగతికి అండగ అనే కార్యక్రమంలో 750 మీటర్ల మట్టి రహదారి నిర్మాణానికి ఎన్డీఏ కూటమి నాయకులు శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా చింతపల్లి మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్ని రాజుబాబు మాట్లాడుతూ గ్రామ సభల్లో తీర్మానించిన పని ప్రకారమే అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందన్నారు. గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో గ్రామాలలో అభివృద్ధి పనులకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామసభల ద్వారా సమస్యలను గుర్తించి అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.ఈ పనులను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు పొత్తూరు.రామ్మూర్తి ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు డొంకడా సత్యనారాయణ, గడుతూరి అన్నపూర్ణ, చొక్కాకుల రమణ, సురకత్తి జయ, వాడకాని రాజకుమార్, బీ. సోమలింగంపడాల్, ఎస్ .బాలకృష్ణ, కే.రాజేష్, రామారావు, ఎస్.సంతోష్, కృష్ణమూర్తి, జగన్నాధం,GSR(శ్రీను), వినీత్, గొర్లి రమణ, పంచాయతీ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లు, లబ్బంగి కొత్త వీధి గ్రామ పెద్దలు రాజుబాబు, ఎర్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.