పాఠశాలలో అలరించిన అష్టావధానం, పుస్తకావిష్కరణ

పాఠశాలలో అలరించిన అష్టావధానం, పుస్తకావిష్కరణ

జనం న్యూస్ :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి: నవంబర్ 24 ఆదివారం:విద్యార్థులు బాల్య దశ నుంచే పద్యంపై అవగాహన పెంచుకోవాలనిఅవదాన పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మరుమాముల దత్తాత్రేయశర్మ అన్నారు. శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవెలిఘనపూర్ లో ప్రముఖ యువ అవధాని అవుసుల భానుప్రకాష్ అష్టావధానం, బాల సాహితీవేత్త, స్థానిక తెలుగు ఉపాధ్యాయులు ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బాలలార! శతకం పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా హాజరైన మరుమాముల దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే సాహిత్యం వైపు విద్యార్థులు దృష్టి సారించినట్లయితే భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్న సమాజ సేవకు పాటుపడతారన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆడెపు కరుణాకర్ మాట్లాడుతూ కల్మషం లేనటువంటి బాలలకు పద్యం కవిత  పలు వస్తువులపై రచనలు చేయించడం మూలంగా బాలలకు వికాసం, విజ్ఞానం అందుతుందన్నారు. తెలుగు భాషలో మాత్రమే ఉండే ఏకైక ప్రక్రియ అవధానం అట్టి అవధానం టీవీలలో వార్తాపత్రికల్లో సామాజిక మాధ్యమాలలో చూసే సందర్భాన్ని ఈరోజు హవేలీ ఘనపూర్ పాఠశాలలో చేయడం సంతోషమన్నారు. అష్టావధాని, స్వర్ణకంకణ గ్రహీత అవుసుల భానుప్రకాష్ చక్కటి పద్యదారతో అవధానం చేయడమే కాకుండా, పృచ్చకులు అడిగిన ప్రశ్నలకు పద్యంలో అప్పగించి, తిరిగి ధారణ చేసి విజయవంతంగా 43వ అవధానాన్ని పూర్తి చేశారు. అందర్ని బాల్యదశకు తీసుకువెళ్లే 108 పద్యాల తోరణం బాలలార! పుస్తకావిష్కరణ గావించి, స్థానిక తెలుగు ఉపాధ్యాయులు ఉండ్రాళ్ళ రాజేశంను అభినందించారు. చిన్న వయసులోనే బాలల కోసం  రాష్ట్రస్థాయిలో కథలు గేయాలు, పద్యాలు పలు ప్రక్రియల ద్వారా చైతన్యం చేస్తున్నా రాజేశం సాహిత్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పృచ్చకులుగా వరుకోలు లక్ష్మయ్య, మంచినీళ్ల సరస్వతి రామశర్మ, సింగీతం నరసింహారావు, గిర్ని అంజాగౌడ్, ఆదిమూలం చిరంజీవి, పాఠశాల విద్యార్థులు కీర్తన, నిత్యాలహరి ప్రవళికలు పాల్గొన్నారు. తెలుగు ఉపాధ్యాయులు నల్ల అశోక్ ఆద్యంతం కార్యక్రమాన్ని నిర్వహించి, అలరించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి మధుమోహన్ ప్రధానోపాధ్యాయులు నాగుల్ మీరా, పాఠశాల చైర్మన్ స్వాతి, తెలుగు ఉపాధ్యాయురాలు ఎల్లమ్మ రాష్ట్రస్థాయిలో పేరు పొందిన కవులు, కవయిత్రులు ఎన్నవెళ్ళి రాజమౌళి, గుండ్ల రాజు,  దుడుగు నాగలత, అనిశెట్టి సతీష్ కుమార్, ఈగ కృష్ణమూర్తి, వై.రాజశేఖర్, సత్యం, శశికుమార్, మంగ నర్సింలు, చంద్రశేఖర్, బాగు రాజు, శ్యామశ్రీ, ఎల్లం, యాదగిరి, చంద్రం, దాసరి రాజు, ఉండ్రాళ్ళ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.