పాపం.. నిద్రపోతున్న వ్యక్తి నిక్కర్లో దూరిన పాము.. ఆ తరువాత..! (వీడియో చూడండి)

జనం న్యూస్: పాము..ఈ పేరు వింటే చాలు.. చాలా మంది భయంతో పరుగులు తీస్తారు. అక్కడెక్కడో పాము ఉందని తెలిస్తే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతారు. పాము కాటుకు గురైతే కొన్ని గంటల్లోనే మరణం సంభవిస్తుంది. అందుకే పాములకు దూరంగా ఉంటారు ప్రజలు. ప్రస్తుతం, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో నిద్రిస్తున్న వ్యక్తి షార్ట్‌లోకి పాము దూరింది. ఆ తర్వాత ఏం జరిగింది..? అతడు ఆ పామును నుంచి తప్పించుకున్నాడా..? లేదా చూపించే షాకింగ్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటన భారతదేశంలో జరగలేదని, థాయ్‌లాండ్‌లోని రేయోంగ్‌లో జరిగిందని సమాచారం.. ఒక వ్యక్తి రాత్రి పూట లోదుస్తులు మాత్రమే ధరించి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అతడు గాఢ నిద్రలో ఉండగా, అకస్మాత్తుగా తన లోదుస్తుల లోపల ఏదో కదులుతున్నట్టుగా అనిపించింది. తొలుత ఎవరో కావాలనే తనను అట్టపట్టి్స్తూ అల్లరి చేస్తున్నారని అనుకున్నాడు. కానీ కొంతసేపటికి తన షార్ట్‌ లోపలికి పాము వచ్చిందని గ్రహించాడు. ఆ తరువాత ఆ వ్యక్తి ధైర్యం చూపించి నెమ్మదిగా తన స్నేహితుడికి ఈ విషయాన్ని తెలియజేశాడు. తన ఫ్రెండ్‌ వచ్చి చూడగా, నిజంగానే అతడి షార్ట్‌లోపలికి పాము దూరినట్టుగా గుర్తించాడు. ఏ మాత్రం కదలకుండా ఉండాలని హెచ్చరించాడు. దాంతో షార్ట్‌లో పాము దూరిన వ్యక్తి నిశ్శబ్దంగా కదలకుండా పడుకున్నాడు. దాంతో తన స్నేహితుడు ఒక సీకు లాంటి వస్తువుతో పామును నెమ్మదిగా బయటకు లాగి పట్టేసుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పామును షార్ట్‌లో నుండి బయటకు తీయడం కనిపిస్తుంది. అందులోకి ప్రవేశించిన పాము ప్రమాదకరమైన నాగుపాము అని తేలింది. పామును బయటకు తీసి సంచిలో ఉంచి సురక్షిత ప్రదేశంలో వదిలేశారు. ఈ వైరల్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో మూడు మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తి ధైర్యాన్ని అభినందించాలి అని సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ఇంత భయానక పరిస్థితి ఉన్నప్పటికీ అతడు ప్రశాంతంగా పడుకున్ని ఉండటం చాలా పెద్ద విషయం అని మరొకరు రాశారు.