మహారాజా కళాశాలలో ఫీజులు దోపిడీ ఆపాలని కలెక్టరేట్ వద్ద ధర్నా..
జనం న్యూస్ 28 అక్టోబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
భారత్ విద్యార్థి ఫెడరేషన్ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహారాజా కళాశాల లో ఫీజుల దోపిడీకి ఆపాలని మహారాజ కళాశాల నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వ ర్యాలీ చేయడం జరిగింది .ర్యాలీ అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ మాట్లాడుతూ సేవ చేయాలనే లక్ష్యంతో PVG రాజు గారు పెట్టిన మహారాజా కళాశాలలో నేడు విద్యార్థుల నుండి ఫీజులను జలగల్ల పీలుస్తున్నారని. గత రెండు రోజుల క్రితమే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బకాయిలో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన విడుదల చేయాలని ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో భాగంగా ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యే లు మరియు జిల్లా కలెక్టర్ వీరి హామీగా ఏదైతే బకాయిలో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన పడేవరకు కళాశాలకు ఫీజులు చెల్లించిన అవసరం లేదని అలాగే పరీక్షల సందర్భంలో ఎటువంటి షరతులు లేకుండా పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని అలాగే ఎటువంటి అడ్డంకులు లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థులకి మరియు కళాశాల యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది అయితే దీనికి భిన్నంగా మహారాజా కళాశాలలో ఫీజులు కట్టమని ఒత్తిడి తేవడం ప్రభుత్వం నిర్ణయించిన నియామకాలకు వ్యతిరేకంగా యాజమాన్యం వ్యవహరించడం ఫీజులు చెల్లిస్తే గాని పరీక్షలు రాయడానికి అనుమతి లేదని విద్యార్థుల్ని భయబ్రాంతులకు గురిచేసి ఫీజులు వసూలు చేయడం అనేది సరికాదని .పరీక్షల సందర్భంలో అనేక కారణాలు చొప్పున విద్యార్థుల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వస్తువులు చేస్తున్నారు అని ,ఇది విద్యార్థుల పక్షాన మహారాజా కళాశాల యాజమాన్యం మొండివైఖరి చూపించడమేనని ఈ విధానాలని తక్షణమే ఆపాలని తెలియజేశారు .అనంతరం కలెక్టర్ గారికి సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రం అందజేయడం జరిగింది ,కలెక్టర్ గారు దీనికి సమాధానం గా ఎటువంటి సరతులు లేకుండా పరీక్షలు రాయడానికి విద్యార్థులు కు అనుమతి ఇవ్వాలనిఫీజుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు విద్యార్థులకు కలగకూడదని మహారాజ కళాశాల యాజమాన్యానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పి రమేష్ మరియు జిల్లా కమిటీ నాయకులు రాజు ,సోమేశ్, సుస్మిత మరియు పట్టణ నాయకులు గుణ, రాహుల్ ,శిరీష,శిరీష తదితరులు పాల్గొన్నారు...