మాగనూరు పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ 30 మంది విద్యార్థులకు అస్వస్థత
జనం న్యూస్ నవంబర్ 260నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ప్రతినిధి
సబ్జెక్ట్ నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్లీ మధ్యాహ్నం భోజనం చేసిన 30 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది.. వారిని హుటాహుటిన మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.. ప్రభుత్వం వారం రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన అదే నిర్లక్ష్యం వహించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దగ్గరుండి వంటలు వండిస్తున్న పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఎలా అవుతుందని... నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని.. పాఠశాలలకు వెళ్లాలంటే భయపడుతున్నారని ఆగ్రహం చెందారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు ఇవ్వకపోవడం... నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయకపోవడం.. టీచర్లకు అధికారులకు మధ్య సమన్వయం లోపించడంతో విద్యార్థులు నలిగిపోతున్నారని ఆరోపించారు.. తాము పిల్లలకు మంచి భోజనం వండి పెడితే రాజకీయం చేశారని అంటగట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.