ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్ వినతిపత్రం

ఆర్టీసీ ఔట్సోర్సింగ్  సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జోనల్ చైర్మన్  వినతిపత్రం

జనం న్యూస్ 26 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగు  ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం  నూతన బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర,ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ వారికి విజయనగరం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఎ.పి.యస్.ఆర్.టి.సి. అవుట్సోర్సింగ్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ సెక్రెటరీ  ఏ అశోక్‌  మాట్లాడుతూ, ఆర్టీసీ కాంట్రాక్టు 7800 మంది కార్మికులు  కాంట్రాక్ట్ వ్యవస్థ థర్డ్ పార్టీ  విధానంలో పని చేస్తున్నాం, థర్డ్ పార్టీ విధానం వల్ల చాలా నష్టపోతున్నాం. ఆర్టీసీలో థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేసి, నేరుగా సంస్థ నుంచి జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన అప్కాస్‌లో ఆర్టీసీని కలపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.ఈ సమస్యలను గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని కోరారు. స్టేట్ పబ్లిక్ సెక్రెటరీ మధు, తిరుపతి,శివ, ప్రసాద్, నర్సిమ్మ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.