విజయ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం
జనం న్యూస్ 26 ఆలేరు యాదాద్రి జిల్లా ( రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు పట్టణంలో బస్టాండ్ అవరణలో విజయ నర్సింగ్ హోమ్ బిగ్ టీవీ అధ్వర్యంలో సోమవారం రోజున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ విజయ నర్సింగ్ హోమ్ డైరెక్టర్ డా.సూర్య తేజ ను శాలువాతో సత్కరించి మాట్లాడుతూ పేదవారికి ఉచిత వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం అభినందనీయం అని పేదవారికి వైద్య సేవ చేసే డాక్టర్లకు వారికి నా పూర్తి సహకారం అందిస్తాను అని పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందించడం లో విజయ నర్సింగ్ హోమ్ డాక్టర్ల సిబ్బందిని అభినందించారు ప్రతి పల్లెలకు మీడియా ద్వారా డాక్టర్ల సహకారం తో ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు పాల్గొన్నవారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎం ఎ ఏజాజ్ నీలం పద్మ చింతలపని శ్రీనివాస్ రెడ్డి విజయ నర్సింగ్ హోమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు