వృద్ధురాలిని మోసగించి మూడు ఎకరాల పొలం రిజిస్ర్టేషన్‌...

వృద్ధురాలిని మోసగించి మూడు ఎకరాల పొలం రిజిస్ర్టేషన్‌...

జనం న్యూస్ 29 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు తహసీల్డార్‌ కార్యాలయం ఎదుట బాధితులు... వారసత్వంగా వచ్చిన పొలంను ఫ్యామిలీ సర్టిఫికెట్  లేకుండానే రిజిస్ర్టేషన్‌ చేయొచ్చా అంటూ బాధితుల ప్రశ్న లక్ష రూపాయలకు మూడు ఎకరాలు స్వాహా చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో 75 ఏళ్ల వృద్ధురాలిని మోసం చేసి లక్షలు విలువ చేసే భూమిని రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న ఘటన గద్వాల్ నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గట్టు మండలం పెంచికలపాడు  గ్రామానికి చెందిన మాల తిమ్మక్క భర్త మునెప్ప, గ్రామ శివారులోని సర్వే నెంబరు 283/1 11, 282/1a, 2.29  రూ.30 లక్షల విలువ చేసే మొత్తం మూడు ఎకరాల పొలం ఉంది. తిమ్మక్క కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు, ఉండగా వారు అందరూ మరణించడంతో ఇద్దరి కుమారుల భార్యలు  మరియు వారి కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు,  మూడో కూతురి కుమార్తె పెళ్లి కొరకు గత ఆరు నెలల కిందట పెళ్లి కి లక్ష రూపాయల అప్పు కొరకు ప్రయత్నిస్తుండగా ఈ నేపథ్యంలో సదరు వల బావ అడవి రంగన్న కుమారుడు అయినటువంటి మాల నాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెను కలిశాడు. డబ్బులు నేను ఇస్తానంటూ నమ్మబలికాడు. పాసు పుస్తకం పెట్టుకొని కొన్ని కాగితాలపై సంతకాలు కావాలంటూ అలా అయితే డబ్బులు ఇస్తానని చెప్పి తహసీల్డార్‌ కార్యాలయానికి తీసుకెళ్లాడని తిమ్మక్క తెలిపింది.కానీ ఎమ్మార్వో కూడా ఏంటి కొనుగోలు చేస్తున్నారా మీరు అమ్ముతున్నారా అని కూడా అడగలేదు దీనికంతా కారణం ఎమ్మార్వో మరియు కొందరు పైరవీకారులే  కలిసి మూడు ఎకరాల పొలాన్ని దొంగతనంగా రిజిస్ర్టేషన్‌ చేయించారని వృద్ధురాలు ఆరోపించారు, ఆలస్యంగా కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా..నాగరాజు వాళ్ళ అక్క అయినటువంటి రంగమ్మ కూతురు అయినటువంటి మునెమ్మ, పేరుట రిజిస్టర్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు...మూడు ఎకరాల పొలం అమ్మినట్లు ఆమె మనవరాలు చూడడంతో ఈ మోసం బయటపడింది. ఆ కే మునెమ్మ పేరుపై రిజిస్ర్టేషన్‌ అయిందని ఎమ్మార్వో తెలిపారు.కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా ఎలా రిజిస్ర్టేషన్‌ చేస్తారని తహసీల్దార్‌ను బాధితులు నిలదీశారు. తమకు న్యాయం చేయాలంటూ తహసీల్దార్‌ ఆఫీసు ఎదుట వారి ఆవేదన తెలిపారు... ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ లేకున్నా రిజిస్ర్టేషన్‌..ధరణి పోర్టల్‌లో ఉంటే రిజిస్ర్టేషన్‌ చేయొచ్చు. రోజూ కార్యాలయంలో 15 నుండి 30 రిజిస్ర్టేషన్లు అవుతాయి. ప్రతిదీ వివరంగా తెలుసుకోవడానికి సమయం సరిపోదు. అయితే వృద్ధురాలి కి అంత తానేనంటూ నాగరాజు  తెలపడంతో రిజిస్ర్టేషన్‌ చేశామని, నన్ను డిస్టర్బ్ చేయొద్దండి వర్క్ లో ఉన్న వెళ్లిపోండి ఏదైనా ఉంటే కలెక్టర్ కి ఫిర్యాదు చేయండి అంటూ తహసీల్డార్‌ సరిత రాణి వివరించారు...