శాంతియుతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుశాఖ సూచించిన నిబంధనలు పాటించాలి

శాంతియుతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు పోలీసుశాఖ సూచించిన నిబంధనలు పాటించాలి

- విజయనగరం జిల్లా  ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 09 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
నిమర్జనం నిర్వహించే చెరువులు, నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ శాంతియుతంగా ఉత్సవాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులే పూర్తి బాధ్యత వహించాలన్న జిల్లా ఎస్పీఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా నిబంధనల మేరకు మాత్రమే మైకులు వినియోగించాలన్న జిల్లా ఎస్పీ విజయనగరం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది సెప్టెంబరు 7, 8 తేదీల్లో సందర్శించి, వాటి అనుమతులను పరిశీలించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణకు ఇంకనూ అనుమతులు పొందని మండపాలకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఉత్సవ నిర్వాహకులకు పోలీసు అధికారులు సెప్టెంబరు 8న సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - గణేష్ ఉత్సవాల వలన ఆయా ప్రాంతంలో వాహనాల రాక పోకలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాలను సందర్శించేందుకు వచ్చే భక్తుల వాహనాలను పార్కింగు చేసేందుకు పార్కింగు స్థలాలను ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణ వలన స్థానికులు, ఇతర మతస్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్ధిష్టమైను సౌండుతో, నిర్ధిష్టమైన సమయాల్లో మాత్రమే మైకులను వినియోగించాలన్నారు. ఉత్సవాల వద్ద డిజేలు, అశ్లీల నృత్యాలు నిర్వహించ రాదన్నారు. నిమర్జనం నిర్వహించే సమయంలో మద్యం సేవించడం, కండ్లకు హాని కలిగించే రంగులు జల్లుకోవడం, బాణసంచా కాల్చడం చేయరాదన్నారు. నిమర్జనం నిర్వహించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు చర్యలు చేపట్టాలన్నారు. మండపాల వద్ద ఏర్పాటు చేసే మైకు సెట్స్ కు తప్పనిసరిగా పెర్మిషను తీసుకోవాలని, పెర్మిషనులో పొందిపర్చిన నిబంధనలు పాటించాలన్నారు. ఇతర మతస్థులకు ఇబ్బందులు కలిగించకుండా వారితో సంయమనంతో వ్యవహరించి, మతసామరస్యాన్ని పాటించాలన్నారు. రాత్రి సమయాల్లో విగ్రహాల వద్ద వెలిగించే దీపాల వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యత వహించాలని, అగ్ని ప్రమాదాలను నియంత్రించేందుకు ఇసుక బకెట్లును, డ్రమ్ములతో నీళ్ళును అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ శాఖ అనుమతితో విద్యుత్ సరఫరాకు తాత్కాలిక మీటర్లు చేసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల వద్దకు వచ్చే అనుమానస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించే మండపాల వద్ద పాయింట్ బుక్కులు ఏర్పాటు చేయాలని, అధికారులు, సిబ్బంది ఆయా మండపాలను సందర్శించే సమయాల్లో తనిఖీలు నిర్వహించి, పాయింట్ బుక్కుల్లో సంతకాలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గణేష్ నిమర్జనం నిర్వహించే చెరువులు, నదులు వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, గజఈతగాళ్ళును నియమించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.