శాసనసభ కార్య విధానం మరియు కార్యక్రమ నిర్వాహణ నియమావళిపై తెలంగాణ రాష్ట్ర శాసనపరిషత్తు
జనం న్యూస్ 13 డిసెంబర్ 2024 : జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా శాసనసభ తెలంగాణ రాష్ట్ర శాసన పరిషతు మరియు శాసనసభ సభ్యులకు జూబ్లీహిల్స్ MCRHRD లో ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరిగింది.ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, డిప్యూటీ చైర్మన్ శ్రీ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, లేజిస్లేచర్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు, రెవెన్యూశాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గార్లు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు.◆ పాల్గొన్న ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, MCRHRD స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ గారు, లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు, లేజిస్లేచర్ అధికారులు, సిబ్బంది.◆ శాసనమండలి సభ్యులు 17 మంది, శాసనసభ సభ్యులు 61 మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు.ఈసందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారికంగా శాసన పరిషత్తు, శాసనసభ సభ్యులకు ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.శాసన వ్యవహారాలు తెలుసుకోవాలనే ఆసక్తితో సభ్యులు హాజరయ్యారు. చాలా సంతోషం.ఈ రెండు రోజుల ఓరియెంటేషన్ ప్రోగ్రాం ద్వారా శాసన పరిషత్తు, శాసనసభ లలో మీ హక్కులు, బాధ్యతలు తెలుసుకున్నారు.మనం ఎంత థియరీ నేర్చుకున్నా దానిని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి విలువ, నిజమైన గుర్తింపు.మీరు తెలుసుకున్న విషయాలను వచ్చే సమావేశాలలో అమలు చేయడం ద్వారా మీకే మంచి పేరు వస్తుంది, గౌరవం పెరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమంలో శిక్షణ ఇచ్చిన PRS Research institute experts కు ధన్యవాదాలు.MCRHRD కి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉన్నది. సదస్సు నిర్వాహనకు సహకరించిన MCRHRD అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు. MCRHRD మరియు లేజిస్లేచర్ మద్య కోఆర్డినేషన్ చేసి ఈ సదస్సును విజయవంతం చేసిన మా లేజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు గారికిఅభినందనలు.భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు తరచుగా నిర్వహించబడుతాయి.శాసనసభ్యులకు క్రీడలు నిర్వహించడం, స్టడీ టూర్ లకు పంపండం వంటి కార్యక్రమాలు జరుపుతాం.