పేదింటి పెండ్లికి రమాకాంత్ రెడ్డి ఆర్థికసాయం

పేదింటి పెండ్లికి రమాకాంత్ రెడ్డి ఆర్థికసాయం

10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత..

 జనం న్యూస్ డిసెంబర్18.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి పుల్లేర శివ్వయ్య - మైసమ్మ దంపతుల కుమారుని వివాహానికి తాజామాజీ మండల వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, కొత్తపేట మాజీ సర్పంచ్ సాన్వి రమాకాంత్ రెడ్డి తన స్వంత డబ్బులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈసందర్బంగా రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి పెండ్లిలకు ఆర్థిక సహాయం అందజేయడంలోనే ఎంతో సంతృప్తి ఉందని ఆయన అన్నారు. సామాజిక సేవలో ముందుండాలన్నదే తన లక్ష్యమని ఆయన అన్నారు. తన కుమారుని వివాహానికి ఆర్థిక సహాయం అందించిన రమాకాంత్ రెడ్డి దంపతులకు పుల్లేర శివ్వయ్య దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ నర్సింహారెడ్డి,సుండు అశోక్,మంగళపర్తి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.