సిపిఎం జిల్లా కమిటీ సభ్యునిగా రెండోసారి ఎన్నిక; ఎం ఏ ఇక్బాల్
జనం న్యూస్ 18 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్ల (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం ఏ ఇక్బాల్ ను రెండవసారి జిల్లా కమిటీ సభ్యునిగా ఎన్నుకొన్నారు15-17 వరకు జరిగిన మహాసభలలో సిపిఎం పార్టీ రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ప్రజా పోరాటాలను మార్గ నిర్దేశం చేసుకోవడంలో ఈ మహాసభలు విజయవంతం అయ్యాయి ఈ సందర్భంగా జిల్లా కమిటీకి ఎన్నికైన ఎం ఏ ఇక్బాల్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆలేరు ప్రాంతంలో కార్మికులు కర్షకులు పేదలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పాలకులకు కనువిప్పు కలిగే విధంగా పోరాటాలు నిర్వహిస్తామని ఈ పోరాటాలకు ప్రజలు ప్రజాతంత్ర వాదులు సిపిఎం పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు వీరితోపాటు పట్టణ నాయకులు మోరిగాడి రమేష్ ఘనగాని మల్లేశం వడ్డెమాను బాలరాజు భువనగిరి గణేష్ కాసుల నరేష్ రాజేష్ తదితరులు ఉన్నారు