శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సంకు విస్తృత బందోబస్తు
-రాష్ట్ర హోంశాఖామాత్యులు వంగలపూడి అనిత
జనం న్యూస్ 15 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలో అక్టోబరు 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న శ్రీ పైడితల్లమ్మ తొలేళ్ళు, సిరిమానోత్సవం సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసుశాఖ విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిందని రాష్ట్ర హెూంశాఖ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రివర్యులు వంగలపూడి అనిత అక్టోబరు 14న తెలిపారు. శ్రీ పైడితల్లమ్మను సందర్శించేందుకు విచ్చేసిన రాష్ట్ర హెూంశాఖ మంత్రివర్యులకు స్థానిక ఎమ్మేల్యే అతిధి గజపతిరాజు, పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మరియు ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు మంత్రివర్యులకు మేళ తాళాలతో స్వాగతం పలకగా, మంత్రి అమ్మవార్కి ఘటాన్ని సమర్పించారు. అనంతరం, వేద పండితులు ఆశీర్వచనం అందించి, అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు అందజేసారు.అనంతరం, రాష్ట్ర హెూంశాఖామాత్యులు ఆలయం వద్ద జిల్లా పోలీసుశాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూంను సందర్శించి, బందోబస్తు, భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసుశాఖ చేపట్టిన భద్రత చర్యలను, బందోబస్తు ఏర్పాట్లును రాష్ట్ర మంత్రికి వివరించారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసినట్లు, పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతను కమాండ్ కంట్రోల్ రూం నుండే పర్యవేక్షించే విధంగాను, సందర్భనుసారంగా అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మంత్రివర్యులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ - రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవంకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పోలీసుశాఖ 2000మందితో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టిక్కెట్స్ విక్రయాలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పట్టణంలో 80 సిసి కెమెరాలను వివధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, వాటిని కమాండ్ కంట్రోల్ రూం నుండి పర్యవేక్షించే విధంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ చర్యలు చేపట్టారన్నారు. ఆకతాయిల ఆట కట్టించేందుకు ప్రత్యేకం షీ టీమ్స్, దొంగతనాలను, జేబు దొంగతనాలను నియంత్రించేందుకు క్రైం టీమ్స్, దివ్యాంగులు, వృద్ధులకు దర్శనం కల్పించడంలో సహాయాన్ని అందించేందుకు పోలీసు సిబ్బందితో సేవాదళ్ ను, ప్రజలకు సహాయ పడేందుకు మూడు పోలీసు హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడంతోపాటు, ట్రాఫిక్ రెగ్యులేషనుకు ప్రత్యేకంగా సిబ్బందినికేటాయించామని హెూంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, స్థానిక ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పల నాయుడు, ప్రజా ప్రతినిధులు, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, సిహెచ్. సూరి నాయుడు, పలువురు ఎస్ఐలుమరియు ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.