సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసేది ఎప్పడు ఎమ్మార్సీ తాళాలు తీసేది ఎప్పుడు...

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసేది ఎప్పడు ఎమ్మార్సీ తాళాలు తీసేది ఎప్పుడు...

మూతపడ్డ మండల విద్యా వనరుల కేంద్రం..

జనం న్యూస్ డిసెంబర్ 24 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ 

గత 14 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు తమ యొక్క ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని సమ్మె చేయడం జరుగుతుంది. సమ్మెలో భాగంగా జీవో  కాపీ వచ్చేవరకు విధుల్లో చేరేది లేదని మండల విద్యా వనరుల కేంద్రానికి తాళం వేసి  14 రోజులుగా పూర్తి స్థాయిలో సమ్మెకు దిగారు. అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన మాట ప్రకారం అందరినీ రెగ్యులర్  చేయాలని ఆత్మకూర్ (యస్) మండల విద్యావనల కేంద్రంలోని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు అన్నారు.ఇప్పటికీ ప్రభుత్వం మీద తమకు పూర్తి నమ్మకం ఉందని ,ముఖ్యమంత్రి వెంటనే చొరువ తీసుకొని మా బతుకుల్లో మరియు మా జీవితాల్లో వెలుగు నింపుతాడని ఆశిస్తున్నామని వారు అన్నారు.
ఈ మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేసే ఎంఐఎస్ కోఆర్డినేటర్, ఐ ఈ ఆర్ పి, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెసెంజర్ మరియు కేజీబీవీ టీచింగ్ & నాన్ టీచింగ్  కోరుకుంటున్నారు. ప్రభుత్వం మాకు న్యాయం చేసి మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి మా మొహంలో చిరునవ్వు నింపి మూతపడిన మండల విద్యా వనరుల కేంద్రం త్వరలోనే తెర్చుకోవాలని ఆకాంక్షిస్తూ