జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి -జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి -జిల్లా అధ్యక్షులు షానూర్ బాబా

 సమావేశంలో మాట్లాడుతున్న షానూర్ బాబా 

 జనంన్యూస్  సెప్టెంబర్ 23 ఆత్మకూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లా 


ఆత్మకూరు మండల కేంద్రంలోని స్థానిక ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హల్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా టీ జే యూ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా హాజరయ్యారు. ఈ సమావేశం ఆత్మకూరు మండల అధ్యక్షులు గడ్డం నాగరాజు అధ్యక్షత జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆత్మకూరు మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రతి జర్నలిస్ట్ కి టీ జే యూ అండగా ఉంటుందని  అన్నారు . జిల్లాలో జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక యూనియన్ టీ జే యూ అని రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద రావు సారధ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు.జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ గృహ పథకంలో  ఇల్లు  కట్టించి ఇవ్వాలని, జర్నలిస్టులకు ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని ,జర్నలిస్ట్ లకు గౌరవ వేతనం కూడా ఇవ్వాలని,జర్నలిస్టుల కుటుంబాలకు కార్పొరేట్ ఉచిత వైద్య సదుపాయాలు అందించాలని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు రూ.15 వేల  పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సమావేశం అనంతరం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో టీ జే యూ జిల్లా కార్యదర్శి గుర్రాల నాగరాజు , టీ జే యూ జిల్లా మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ రెడ్డి , టీ జే యూ  మండల గౌరవ అధ్యక్షులు నోముల రవీందర్ రెడ్డి ,  టీ జే యూ మండల ఉపాధ్యక్షులు షేక్ అజీజ్ ,  టీ జే యూ మండల అధికార ప్రతినిధి పొన్నగాని సతీష్ గౌడ్ , టీ జే యూ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మల్లేష్ , టీ జే యూ మహిళా విభాగం మండల కన్వీనర్ దంతూరి సుమలత గౌడ్ , టీ జే యూ మండల కోశాధికారి కట్టెకోల రమేష్ , టీ జే యూ మండల సహాయ కార్యదర్శి పానుగంటి బాల గంగాధర్ , టీ జే యూ మండల కార్యవర్గ సభ్యులు గుర్రం సురేష్ , వస్తుపుల నరేష్ , నోముల మల్లేష్ గౌడ్ ,  నోముల క్రాంతి గౌడ్ ,  టీ జే యూ గుండాల మండల అధ్యక్షులు సురారపు నరేష్ , టీ జే యూ మండల ఉపాధ్యక్షులు పొన్నగాని యాదగిరి , టీ జే యూ మండల  కార్యదర్శి సూదగాని హరికృష్ణ , టీ జే యూ మండల కార్యవర్గ సభ్యులు చిలుకూరి మోహన్ , సూరిగళ్ల రమేష్ , టీ జే యూ అడ్డగుడూర్ మండల అధ్యక్షులు చింత సుధాకర్ , టీ జే యూ మండల ప్రధాన కార్యదర్శి కాటుకురి వేణు , టీ జే యూ తుర్కపల్లి మండల అధ్యక్షులు షేక్ బురాన్ , టీ జే యూ మండల కార్యవర్గ సభ్యులు పిడుగు బాబు ,  టీ జే యూ  మోట కొండూరు మండల ఉపాధ్యక్షులు  అక్బర్ , టీ జే యూ మోత్కుర్ మండల కమిటీ సభ్యులు చింతల నర్సయ్య , జక్కుల పరుష రాములు ,  తదితరులు పాల్గొన్నారు