సమయపాలన పాటించని కల్లూరు సి హెచ్ సి డాక్టర్

సమయపాలన పాటించని కల్లూరు సి హెచ్ సి డాక్టర్

( జనం న్యూస్) సెప్టెంబర్ 3 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్  విష జ్వరాలతో మండల ప్రజలు అల్లాడుతున్న మండలంలోని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు పనిచేస్తున్న వైద్యులు ఎక్కడ వైద్యం చేస్తున్నారని కనీసం కంటికి కూడా కనబడడం లేదని మండల ప్రజలు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో సాధారణ బదిలీలో భాగంగా పెనుబల్లి సి హెచ్  సి నుండి కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వీధుల్లో జాయిన్ అయిన ఓ డాక్టర్ మండల వైద్యాధికారి కేవలం చుట్టపు చూపుల అప్పుడప్పుడు వచ్చి పోతున్నారే తప్ప ఇంతవరకు పట్టుమని ఒక్కరోజు కూడా సమయపాలన పాటిస్తూ సక్రమంగా విధులు నిర్వహించిన సంఘటన లేవని  ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వైద్యశాలలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ చాకచక్యంగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిసిన సమాచారం. ప్రస్తుతం మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ నందు డెంగ్యూ విజృంభించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఇప్పటికే డెంగ్యూతో ఇద్దరు చనిపోయారని అన్నారు. గతంలో అంబేద్కర్ నగర్ నందు డెంగ్యూతో ఎంతోమంది మృత్యువాతన పడ్డారు. వైద్యో నారాయణని మొత్తుకుంటున్న కనీసం వైద్య క్యాంపులు నిర్వహించి ఆదుకోవలసిన డాక్టరే అందుబాటులో  లేకపోతే మా గతి ఏంటని  ఆవేదన చెందుతున్నారు. వైద్యశాలకు విధుల్లోకి రాకపోవడానికి మరొక కారణం ఉందని సంబంధిత సి హెచ్ సి  వైద్యుడుకు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని తిరువూరు నియోజకవర్గమందు సొంత దవాఖాన ఉందని ప్రస్తుతం దానిపైనే దృష్టి పెడుతూ ప్రభుత్వ దవాఖానను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. వైద్యం చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ దవాఖానాలు అండగా ఉండాలనే లక్ష్యంతో లక్షల్లో జీతాలు హెచ్చిస్తూ వైద్యుల నియమిస్తే జీతం ఇక్కడ విధులు అక్కడ నిర్వహిస్తూ ప్రజలను గాలికి వదిలేయడం సమంజసం కాదని అంటున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే సక్రమంగా విధుల్లో లేనప్పటికీ వారు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుందని అన్నారు.అదే ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటే వ్యవస్థలో ఏం జరుగుతుందో? లోపం ఎక్కడో? ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని తెలిపారు. ఒకవేళ తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి పై ఉన్నత అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే....