సమిష్టితత్వంతో శాంతిభద్రతల పరిరక్షణకు పని చేయాలి

సమిష్టితత్వంతో శాంతిభద్రతల పరిరక్షణకు పని చేయాలి

– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 16 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం 5వ బెటాలియన్ చింతలవలస ఎపిఎస్పీ పరేడ్ గ్రౌండు నందు డిసెంబరు 15న నిర్వహించిన 36వ వార్షిక పోలీసు స్పోర్ట్స్ మరియు గేమ్స్ మీట్ - 2024 ముగింపు వేడుకల్లో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ముఖ్య అతిధిగా హాజరై, క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి, జట్లకు బహుమతులను, మెడల్స్, సర్టిఫికెట్లు ను ప్రధానం చేసారు. ఈ వార్షిక క్రీడా పోటీల్లో 5వ బెటాలియన్ వివిధ కంపెనీలకు చెందిన తొమ్మిది జట్లు స్పోర్ట్సు అండ్ గేమ్స్ మీట్లో పాల్గొన్నాయి.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ - శాంతిభద్రతల పరిరక్షణలో 5వ  బెటాలియన్ పోలీసులు పాత్ర ఎనలేనిదని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న విధుల వలన రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారువిధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న తీవ్రమైన పని, మానసిక ఒత్తిడి నుండి కాస్తా ఉపశమనం కల్పించేందుకు బెటాలియన్ పోలీసులకు స్పోర్ట్సు మీట్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మీట్ లో పోలీసు సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొని, చక్కని క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారన్నారు. అందరూ ఒక చోటకు చేరుకొని, మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో తమలోని క్రీడా ప్రతిభను ప్రదర్శించారన్నారు. ఓటమి నుండి గెలుపుకు అవసరమైన సమిష్టితత్వంను ఏవిధంగా ప్రదర్శించాలో ఈ క్రీడలు మనకు తెలియజేసాయని, అందరిలో స్ఫూర్తి నింపిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.బెటాలియన్ కమాండెంట్ మలికా గార్గ్, ఐపిఎస్ మాట్లాడుతూ - ఈ క్రీడల్లో బెటాలియన్ పోలీసులు, కుటుంబ సభ్యులు అంతా ఉత్సాహంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమించి స్పోర్ట్స్ మీట్ ను చక్కగా నిర్వహించారన్నారు. క్రీడల్లో ప్రదర్శించిన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ను మన జీవితానికి అన్వయం చేసుకోవాలన్నారు. బెటాలియన్ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు అంతా సోదర భావంతో మెలగాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సహాయపడుతూ సమిష్టిగా ఎదుర్కోవాలని కమాండెంట్ మలికా గార్గ్ అన్నారు.టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల పరుగు, వాలీబాల్, షటిల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, లాంగ్ జంప్ వంటి వివిధ క్రీడా పోటీలను పోలీసులు, మినిస్టీరియల్, అధికారులు, పోలీసు కుటుంబాలకు మరియు క్లాస్ 4 ఉద్యోగులకు వేరు వేరుగా నిర్వహించారు.వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన పోలీసు సిబ్బందికి, మినిస్టీరియల్ సిబ్బందికి, పోలీసు అధికారులకు బహుమతులను, సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మరియు బెటాలియన్ కమాండెంట్ మాలిక గార్గ్  ప్రధానం చేసారు. స్పోర్ట్స్ మీట్ లో బి కంపెనీకి చెందిన   సురేష్ వ్యక్తిగత చాంపియన్ షిప్, బి. కంపెనీ జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. ఈ ముగింపు కార్యక్రమానికి మహేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో వివిధ పోలీసు జట్లు నిర్వహించిన మార్చ్ పాస్ట్ ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకోగా, ఎపి ఎస్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది బైకులతో నిర్వహించిన సాహస విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ వార్షిక క్రీడా పోటీల ముగింపు వేడుకల్లో అడిషనల్ కమాండెంట్ లక్ష్మీ నారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ బాపూజీరావు, రమణమూర్తి, శ్రీనివాస్, గోపాలకృష్ణ, రిజర్వ ఇన్స్పెక్టర్లు జి.రవీంద్ర, ఎం.శ్రీనివాసరావు, దానయ్య, నూకరాజు, దామోదర్, కే.కే.ఎం.రాజు, కేశవరావు, చంద్ర మోహన్, ఎ.శ్రీనివాసరావు, సుధాకర్ బాబు, చంద్రశేఖర్, సమర్పణరావు, ఎన్.గణేష్, ఎఓ శోభారాణి, పలువురు ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.