బకాయిలో ఉన్న విద్యా దీవెన ,వసతి దీవెన వెంటనే విడుదల చేయాలి -ఎస్ఎఫ్ఐ
జనం న్యూస్ 22 అక్టోబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో -పెండింగ్ లో ఉన్న విద్యా దీవెన మరియు వసతి దీవెన విడుదల చేయాలని అలాగే ఎటువంటి షరతులు లేకుండా పరీక్ష ఫీజులు కట్టించుకోవాలని కాంప్లెక్స్ నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము,సిహెచ్ వెంకటేష్ లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు అందవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిస్థాయిలో ఆగిపోయిందని , గవర్నమెంట్ ఇచ్చే హామీలు ద్వారానే విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో జాయిన్ అవుతారని ఈరోజు పూర్తిస్థాయిలో విద్యాధీన వసతి దీవెన పడకపోవడంతో విద్యార్థులు కళాశాలకు ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ఫీజులు నియమించడం సరికాదని ఇదే సందర్భంలో పరీక్ష ఫీజు చెల్లించేటప్పుడు కళాశాల యాజమాన్యాలు కళాశాల ఫీజు చెల్లిస్తే గాని పరీక్ష ఫీజు చెల్లించుకోమని విద్యార్థులను బాగా ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ అందించకపోతే విద్యార్థులు ఏ ఆధారంతో చదువుకుంటారని ప్రశ్నించారు ,ధర్నా అనంతరం సమస్యలను వినతిపత్రం ద్వారా జాయింట్ కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. దీనికి సమాధానంగా ఎటువంటి షరతులు లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించుకునే విధంగా డిగ్రీ కళాశాలకు ఆదేశాలు పంపిస్తామని, అలాగే పెండింగ్ లో ఉన్న విద్య దీవెన మరియు వసతి దీవెన విడుదల చేయాలని పై అధికారులకు తెలుపుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జై రవికుమార్ ,ఎం వెంకటేష్ జిల్లా సహాయ కార్యదర్శిలు జగదీష్, శిరీష ,రమేష్ జిల్లా కమిటీ నాయకులు కె. రాజు పట్టణ నాయకులు గుణ ,తేజ,రాహుల్ తదితరులు పాల్గొన్నారు...