సీనియర్ జర్నలిస్టు భాషను పరామర్శించిన కేజేడబ్ల్యుఏ యూనియన్ నాయకులు

సీనియర్ జర్నలిస్టు భాషను పరామర్శించిన కేజేడబ్ల్యుఏ యూనియన్ నాయకులు

స్పందించిన డాక్టర్ సాకేత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కేజేడబ్ల్యుఏ యూనియన్

కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంలో సీనియర్ జర్నలిస్టుగా పనిచేస్తున్న భాష కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆ విషయం కేజేడబ్ల్యుఏ యూనియన్ తెలుసుకొని భాషని సమస్యను అడిగి కందుకూరులోని కోటారెడ్డి హాస్పిటల్ కు తీసుకుని వెళ్లడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ సాకేత్ ను అడిగి భాష ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేలా సహాయం చేయాలని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన డాక్టర్ సాకేత్ కు సీనియర్ జర్నలిస్టు భాష ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యేలా సహాయం చేస్తామన్నారు. సానుకూలంగా స్పందించిన డాక్టర్ సాకేత్ కు యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. భాషకు యూనియన్ సహాయ సహకారాలు అందిస్తుందని ధైర్యం చెప్పడం జరిగింది. భాషను పరామర్శించిన వారిలో కే జే డబ్ల్యు ఏ యూనియన్ అధ్యక్షులు యర్రంశెట్టి ఆనందమోహన్, గౌరవ అధ్యక్షులు నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ గౌడ పేరు రాము, కోశాధికారి చక్కా కేశవ లు ఉన్నారు.