హాస్టల్లో మరణించిన విద్యార్థికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి - SFI
విధుల్లో అలసత్వం వహిస్తున్న వార్డెన్ జానకిరామ్ గారిని సస్పెండ్ చేయాలి
జనం న్యూస్ 04 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్ ఈరోజు ఉదయం అనారోగ్యంతో పట్టణంలో ఉన్న బ్చ్ చిన్న పిల్లల హాస్టల్ లో కొణతాల శ్యామలరావు అనే విద్యార్ది హఠాన్మరణం పాలయ్యారు. ఈ సందర్భంగా SFI జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డీ. రాము, చ్ . వెంకటేశ్ లు మాట్లాడుతూ బ్చ్ స్కూల్ హాస్టల్ లో శ్యామలరావు అనే విద్యార్ది మరణించడానికి ప్రధాన కారణం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే అని విమర్శించారు. హాస్టల్ వార్డెన్ గా ఉన్న జానకిరామ్ గారు గతంలో కూడా అనేక సార్లు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు అని , అసలు హాస్టల్ కు ఎన్నో సార్లు ఆబ్జెంట్ అవుతూ విద్యార్థులను పట్టించుకునే వారు కాదని విమర్శించారు. గత రాత్రి విద్యార్ది అస్వస్థతకు గురైతే వారు తల్లి తండ్రులకు సమాచారం ఇవ్వలేదని , కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకెళ్ళ లేదని విమర్శించారు. వార్డెన్ మీద నమ్మకం తోనే పేరెంట్స్ వారి పిల్లలను హాస్టల్ లో చేర్పిస్తారని అలాంటిది ఈరోజు ఆ బాబు శవాన్ని అప్పగించారని దుయ్యబట్టారు. అంతే కాక ఈరోజు ఉదయం బాబుకి అంత విషమంగా ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళకుండ హాస్టల్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కె తీసుకెళ్లడం వల్లనే విద్యార్థి మరణించి ఉంటాడని వారి కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తక్షణమే విధుల్లో నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్ జానకిరామ్ గారిని , సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో కుమారున్ని కోల్పోయి దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున 25 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కచ్చితంగా ప్రభుత్వం ఈ డిమాండ్లు నెరవేర్చాలని లేనిపక్షంలో విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని దీనికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.