హైదరాబాదులో 10వ తరగతి పిల్లాడితో లేచిపోయిన టీచర్... చీ..చీ ఇదేం పాడు బుద్ధి టీచర్ నీకు..!

హైదరాబాదులో 10వ తరగతి పిల్లాడితో లేచిపోయిన టీచర్... చీ..చీ ఇదేం పాడు బుద్ధి టీచర్ నీకు..!

జనం న్యూస్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన టీచర్ పెడదారి పట్టింది. తన పాడు బుద్ధి బయట పెట్టుకుంది. పాఠాలు చెప్పే పిల్లాడితోనే ప్రేమాయణం నడిపి చివరికి ఆ పదో తరగతి విద్యార్థిని తీసుకుని ఉడాయించింది. హైదరాబాదులో పేరెంట్స్ అందరినీ షాక్ కి గురిచేసింది ఈ ఘటన. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని చందానగర్ పీఎస్ పరిధిలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక మహిళ టీచర్ గా పని చేస్తుంది. తాను పాఠాలు చెప్పే పిల్లాడినే ప్రేమలోకి దింపింది. తెలిసీ తెలియని వయసున్న 10 తరగతి పిల్లాడిని తీసుకుని 10 రోజుల క్రితం జంప్ జిలానీ అంది. టీచర్ చెప్పినట్టే చేసిన ఆ పిల్లాడు తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయాడు. ఆపై బాలుడితో ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం యధేచ్చగా తిరిగింది. స్కూల్ కు వెళ్ళిన పిల్లాడు ఇంటికి రాకపోవటంతో పిల్లాడి తల్లిదండ్రులు గచ్చి బౌలి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అదే రోజు టీచర్ తల్లిదండ్రులు చందానగర్ పీఎస్ లో మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. అయితే మొదట టీచర్ మీద అనుమానం రాలేదు. కానీ ఆమె కూడా అదే రోజు నుండి కనిపించకుండా పోవటంతో పేరెంట్స్ కు, పోలీసులకు అనుమానం వచ్చింది. స్కూల్ లో విచారణ జరిపిన పోలీసులు వారి ఆచూకీ కోసం గాలింపు మొదలు పెట్టారు. ఇక ఒకే చోట ఉంటే దొరికిపోయే ప్రమాదం ఉందని భావించిన సదరు టీచర్, స్టూడెంట్ తో కలిసి అనేక రాష్ట్రాలు తిరిగింది. చెయ్యాలనుకున్న ఎంజాయ్ అంతా చేసేసింది. ఇక గత పది రోజులుగా చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న సదరు టీచర్ ను, బాలుడిని చివరకు పోలీసులు ఒక ప్రాంతంలో గుర్తించి తిరిగి హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. ఇక ఆపై వారు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించి ఇళ్ళకు పంపించారు. అయితే ఈ ఘటన మాత్రం స్కూల్స్ కు పిల్లల్ని పంపిస్తున్న పేరెంట్స్ కు ఆందోళన కలిగించింది. పిల్లలను విద్యావంతులను చేసి మంచి మార్గంలో నడపాల్సిన వారు ఇలా ప్రవర్తిస్తే వారి వద్ద చదువుకున్న విద్యార్థుల గతి ఏమిటని ఆలోచించే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది .