29న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి: భూక్య పాండు నాయక్

29న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి: భూక్య పాండు నాయక్

జనం న్యూస్ నవంబర్ 15(మఠంపల్లి ప్రతినిధి ఏం శంకర్ నాయక్)  సిపిఎం పార్టీ సూర్యపేట జిల్లా తృతీయ మహాసభ సందర్భంగా నవంబర్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వద్ద జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్ పిలుపునిచ్చారు మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం ఎర్ర జెండాల దగ్గర సూర్యాపేటలో జరిగే సిపిఎం పార్టీ జిల్లా మహాసభల కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ నవంబర్ 29న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో వేలాది మందితో బహిరంగ సభ జరుగుతుందన్నారు ఈ బహిరంగ సభకు మఠంపల్లి మండలం నుండి వందలాది మందిని సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు నవంబర్ 29 గాంధీ పార్క్ లో జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ బివి రాఘవులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మల్లు లక్ష్మి హాజరవుతున్నారని అన్నారు నవంబర్ 30 డిసెంబర్ 1వ తేదీలో 500 మంది ప్రతినిధులతో సుమంగళి ఫంక్షన్ హాల్ లో మహాసభలు జరుగుతాయని చెప్పారు ఈ మహాసభల విజయవంతనికై ప్రజలంతా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మఠంపల్లి మండల కార్యదర్శి మాలోతు బాలునాయక్ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి మండల కమిటీ సభ్యులు సయ్యద్ రన్ మియా కే వెంకట్ రెడ్డి డి హరి నాయక్ జల తిరుపతయ్య పొడి శెట్టి రాము ఎం రాజు లక్ష్మమ్మ పుదీల రవి తదితరులు పాల్గొన్నారు