క్రీడాకారులకుఆపద్బాంధవుడు తాజా మాజీ జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త ప్రోత్సాహం...

క్రీడాకారులకుఆపద్బాంధవుడు తాజా మాజీ జడ్పిటిసి  పబ్బ మహేష్ గుప్త ప్రోత్సాహం...

దొంతి, శివ్వంపేట క్రీడాకారులకు తన స్వంత డబ్బులు పదివేల రూపాయలు  అందించిన ఆపద్బాంధవుడు  తాజామాజీ జడ్పీటీసీ  మహేష్ గుప్తా ..మండలంలోని అన్ని గ్రామాలలోని క్రీడాకారులందరికి కూడ తనవంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని ఆపద్బాంధవుడు తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అన్నారు. శనివారం దొంతి, శివ్వంపేట గ్రామాలకు చెందిన క్రీడాకారులకు ప్రోత్సాహంగా తన స్వంత డబ్బులు 10 వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరిగినది. ఈసందర్బంగా పబ్బ మహేష్ గుప్త మాట్లాడుతూ ప్రతినిత్యం క్రీడలలో సాధన చేస్తూ అందులో మంచి ప్రావీణ్యం పొంది నేర్చుకున్న క్రీడలలో మంచి పట్టును సాందించి జిల్లాలో, రాష్ట్రంలో శివ్వంపేట మండలం పేరును మొదటి స్థానంలో నిలబెట్టాలని ఆయన సూచించారు. ఆర్థిక సహకారం అందించిన మాజీ జడ్పీటీసీ మహేష్ గుప్తకు క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో శివ్వంపేట మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, గ్రామకమిటీ అధ్యక్షులు ముద్దగల్ల లక్ష్మీనర్సయ్య,పత్రాల త్రినేష్ గౌడ్, దొంతి చిగుల్లపల్లి శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్, మేస్త్రి వెంకటేష్, గూడూరు కొత్త కుమ్మరి శ్రీకాంత్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.  దంతాన్ పల్లిలో మహేష్ గుప్త ఆర్థిక సహాయం.. @ మండలంలోని దంతాన్ పల్లి గ్రామంలో ఇటీవలే మరణించిన కన్నారం పోచమ్మ కుటుంబానికి తాజామాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త తన స్వంత డబ్బులు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం గ్రామ తాజామాజీ సర్పంచ్ కన్నారం దుర్గేష్, మాజీ ఉపసర్పంచ్ మొలుగు నాగేశ్వరరావు చేతులమీదుగా శనివారం బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈకార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, పర్వతాలు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.