450 కేజీల గంజాయి తో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
జనం న్యూస్ డిసెంబర్ 19 గొలుగొండ రిపోర్టర్ పొట్ల రాజా
అనకాపల్లి జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ , నర్సీపట్నం
గురువారం అనగా 19-12-2024 న గొలుగొండ మండల పోలీసువారు మధ్యప్రదేశ్ మరియు ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లో (మల్కనగిరి జిల్లా ) ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 1) రాజేష్ శర్మ మరియు 2)కిల్లో మహదేవ్ అనువారు 450 కేజీలు గంజాయి అక్రమంగా అశోక్ లైలాండ్ గూడ్స్ వ్యాన్ వాహనంలో తరలిస్తు, అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 450 కేజీలు గంజాయి, అశోక్ లైలాండ్ గూడ్స్ వ్యాన్ మరియు రెండు మొబైల్ లు వశపర్చుకొని కేసు నమోదు చేయడమైనది. వివరాల్లోకెళ్తే గత కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాన్ లో ఒరిస్సా రాష్ట్రం లో మల్కాజిగిరి జిల్లా ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ పరిసర ప్రాంతంలో 450 కేజీ ల గంజాయిని సేకరించి దానిని గూడ్స్ వ్యాన్ పైభాగంలో ఐరెన్ మెస్ ఏర్పాటు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాటిని తార్పన్ లతో కప్పి , ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, దారకొండ రొంపుల ఘాట్ రోడ్ మీదుగా విశాఖపట్నం తరలిస్తుండగా గొలుగొండ మండలంలో చిన్నయ్యపాలెం గ్రామ శివారున వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా గొలుగొండ ఎస్సై రామారావు కి మరియు సిబ్బందికి పట్టుబడినారు. ఈ కేసు నర్సీపట్నం రూరల్ సి. ఐ. రేవతమ్మ ఆద్వర్యం లో , గొలుగొండ మరియు కె. డి. పేట ఎస్. ఐ లు మరియు సదరు రెండు పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది పాల్గొని ముద్దాయిలు ను అరెస్ట్ చేసి కేసు ను చేదించినారు. ఇంకా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంకా మిగతా ఉన్న ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గొలుగొండ మండలం పోలీసు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు వారు పాల్గొన్నారు.