గంజాయి కేసులో ఆరుగురు యువకులు అరెస్టు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 09 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలో గంజాయి కలిగి, చిన్న మొత్తాల్లో విక్రయిస్తున్న ఆరుగురు యువకులను వన్ టౌన్ పోలీసులు నవంబరు 8న అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
విజయనగరం మరియు పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన యువకులు ఒక ప్రాంతంలో చదువుకుంటూ, స్నేహితులుగా ఉంటూ చెడు వ్యసనాలకు అలవాటుపడి, వారి అవసరాలకు ఒడిస్సా నుండి గంజాయిని తీసుకొని వచ్చి, చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి, విక్రయిస్తున్నట్లుగా వన్ టౌన్ పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో రైడ్ చేసి ఆరుగురు యువకులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని వన్ టౌన్ పీఎస్ ఇంచార్జీ సిఐ ఎల్.అప్పల నాయుడు సీజ్ చేశారన్నారు.నిందితులు (1) చింతలవలసకు చెందిన కోరుకొండ కార్తీక్ (2) గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామానికి చెందిన పాపల కిరీటి (3) రొంగల ఆనంద్ (4) జి ఎల్ పురం మండలానికి చెందిన పురుషోత్తం జగదీశ్ (5) విజయనగరం పట్టణం గాజులరేగ కు చెందిన బెహరా దీపక్ పట్నాయక్ (6) కామాక్షి నగర్ కు చెందిన పెనుమజ్జి లోకేష్ కుమార్ ఉన్నారన్నారు.నిందితులు చెడు అలవాట్లకు లోనై గంజాయి సేవిస్తూ, తోటి స్నేహితులకు విక్రయిస్తూ పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.